https://oktelugu.com/

వైసీపీ నేతలపై జనసేన ఎమ్మెల్యే పెత్తనమెంటో?

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వింత రాజకీయాలు చేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైన ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ కు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు దక్కింది. అయితే ఆయన మాత్రం వైసీపీ అనుకూల రాజకీయాలకు పాల్పడుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. రాపాక వరప్రసాద్ ఒకసారి పవన్ కల్యాణ్ తనకు జనసేనలో ప్రాధాన్యం ఇవ్వలేదని.. మరోసారి తన నియోజకవర్గంలో పనులు చేయించుకునేందుకు జగన్ సర్కార్ తో అనుకూలంగా ఉంటున్నానని ప్రకటించి అందరినీ అయోమయానికి గురిచేస్తున్నాడు. Also Read: గల్లా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 19, 2020 / 08:02 PM IST
    Follow us on


    రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వింత రాజకీయాలు చేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైన ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ కు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు దక్కింది. అయితే ఆయన మాత్రం వైసీపీ అనుకూల రాజకీయాలకు పాల్పడుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. రాపాక వరప్రసాద్ ఒకసారి పవన్ కల్యాణ్ తనకు జనసేనలో ప్రాధాన్యం ఇవ్వలేదని.. మరోసారి తన నియోజకవర్గంలో పనులు చేయించుకునేందుకు జగన్ సర్కార్ తో అనుకూలంగా ఉంటున్నానని ప్రకటించి అందరినీ అయోమయానికి గురిచేస్తున్నాడు.

    Also Read: గల్లా పయనం కమలం వైపేనా?

    ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ పనులు చేయించుకోవడం కొత్తమీ కాదనప్పటికీ రాపాక వ్యవహార శైలి మాత్రం వింతగా కన్పిస్తోంది. జనసేన పార్టీ తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్ ఇటీవల వైసీపీ పార్టీ తరుఫున నియోజకవర్గ బాధ్యతలను తనకు ఇవ్వాలని ఇటీవల ఆయన బహిరంగంగానే సీఎం జగన్ ను కోరారు. రాపాక జనసేనలో కొనసాగుతూ రాజోలు నుంచి వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు తనకు అప్పగించాలని జగన్ ను కోరడంపై రాజకీయ పరిశీలకులే అవాక్కవుతున్నారు. రాపాక వింత రాజకీయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

    రాజోలు నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసిన బొంతు రాజేశ్వర్ 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆయనప్పటికీ ఆయనకు రాజోలులో బలమైన వర్గం ఉంది. అయితే రాపాక వరప్రసాద్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ నేతలపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల కార్పొరేషన్ ఛైర్మన్ పెడపాటి అమ్మాజీ రంగంలోకి దిగారు. ఆమె ఈ నియోజకవర్గానికి నాన్ లోకల్ అయినప్పటికీ వైసీపీ రాజోలు నియోజకవర్గ ఇన్ ఛార్జీని అనుహ్యంగా దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ ఇటీవల జగన్ తనకు రాజోలు సీటు ఇద్దామనుకున్నారని అయితే కుదరకపోవడంతో తాను జనసేనలో చేరి గెలిచినట్లు పేర్కొన్నారు.

    Also Read: సోము వీర్రాజు పై జగన్ విసరనున్న అస్త్రం ఇతనే..?

    తాను ఎమ్మెల్యేగా గెలిచాక సీఎం జగన్ కలిసి నడుద్దామని చెప్పారని తెలిపారు. ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. అందుకే తాను ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే నియోజకవర్గంలోని వైసీపీ నేతలపై జనసేనకు చెందిన ఎమ్మెల్యే పెత్తనం చేయడం ఏంటనే గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈనేపథ్యంలో రాపాక వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. తమపై జనసేన ఎమ్మెల్యే పెత్తనం చేయడాన్ని వైసీపీ శ్రేణులు సహించలేకపోతున్నాయి. దీంతో రాపాక వ్యవహారంపై సీఎం జగన్ వద్దే ఏదో ఒకటి తేల్చుకోవాలని వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. దీంతో రాజోలు రాజకీయం రసవత్తరంగా మారుతోంది.