Homeజాతీయ వార్తలుVijay political decision inspiring: డ్రైవర్ కొడుకుకు ఎమ్మెల్యే టికెట్.. పైగా గెలిపించుకున్నాడు.. శభాష్ విజయ్.....

Vijay political decision inspiring: డ్రైవర్ కొడుకుకు ఎమ్మెల్యే టికెట్.. పైగా గెలిపించుకున్నాడు.. శభాష్ విజయ్.. నిజంగా జననాయగన్ వే..

Vijay political decision inspiring: రీల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్ వేరు. రీల్ లైఫ్ లో హీరోలు దైవంశ సంభూతులు. రియల్ లైఫ్ లో మాత్రం అలా ఉండరు. కనీసం ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరు. కానీ కొంతమంది హీరోలు రీల్ లైఫ్ లో ఒకే విధంగా ఉంటారు. రియల్ లైఫ్ లో కూడా ఒకే విధంగా ఉంటారు.. అటువంటి వారిలో విజయ్ ఒకరు. విజయ్ ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. టీవీకే […]

Vijay political decision inspiring: రీల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్ వేరు. రీల్ లైఫ్ లో హీరోలు దైవంశ సంభూతులు. రియల్ లైఫ్ లో మాత్రం అలా ఉండరు. కనీసం ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరు. కానీ కొంతమంది హీరోలు రీల్ లైఫ్ లో ఒకే విధంగా ఉంటారు. రియల్ లైఫ్ లో కూడా ఒకే విధంగా ఉంటారు.. అటువంటి వారిలో విజయ్ ఒకరు.

విజయ్ ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. టీవీకే పార్టీని స్థాపించి.. స్వల్ప కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చారు. తమిళనాడు ప్రజలకు ఒక భరోసా కల్పించారు. తమిళనాడు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందు వరుసలో నిలుపుతానని ఆయన ప్రకటించారు. తమిళ ప్రజలకు ఈ ఎన్నికల్లో విజయ్ అనేక వాగ్దానాలు ఇచ్చారు. వాటన్నింటిని నిలబెట్టుకుంటామని ఆయన ప్రకటించారు. విజయ్ ఈ స్థాయిలో విజయం సాధించడం వెనక అనేక కారణాలు దోహదం చేశాయి. అందులో ఒకటి మాత్రం విజయ్ రేంజ్ ను అమాంతం పెంచేసింది.

విజయ్ ఈ ఎన్నికల్లో తన మాజీ కార్ డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ ను విరుగంబక్కం టికెట్ కేటాయించారు. ఇది డీఎంకేకు కంచుకోట లాంటి నియోజకవర్గం. ఈ స్థానంలో శబరినాథన్ ను విజయ్ నిలబెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక సాధారణ కార్ డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం నిజంగానే వార్తల్లో నిలిచింది. ఈ స్థానంలో శబరినాథన్ విజయం సాధించారు. తద్వారా డీఎంకే కంచుకోట ను టీ వీ కేకు అనుకూలంగా మార్చారు.

తనకు టికెట్ కేటాయించిన విషయం తెలియడంతో శబరినాథన్ కన్నీటి పర్యంతమయ్యారు. రాజేంద్రన్ కూడా విజయ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజేంద్రన్ సంవత్సరాల తరబడి విజయ్ కి డ్రైవర్ గా ఉన్నారు. ఆ తర్వాత వ్యక్తిగత సహాయకుడిగా కొనసాగారు. రాజేంద్రన్ తనకు చేసిన సేవలను గుర్తించి విజయ్ శబరి నాథన్ కు టికెట్ ఇచ్చారు.. బి ఫాం తీసుకున్నప్పుడు శబరినాథన్ భావోద్వేగానికి గురయ్యారు. విజయ్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకుంటున్నప్పుడు రాజేంద్రన్ గట్టిగా ఏడ్చారు.. శబరినాథన్ విజయ్ పాదాలను తాకి.. ఆయనను ఆ లింగనం చేసుకున్నారు. విజయ్ రాజేంద్రన్, శబరినాథన్ కన్నీళ్లను తుడిచారు.. తన కెరియర్ ప్రారంభం నుంచి వెంట ఉన్న రాజేంద్రన్ కు విజయ్ ఈ విధంగా సహాయం చేయడం తమిళ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇప్పుడు శబరినాథన్ డ్రైవర్ కొడుకు కాదు.. ఎమ్మెల్యే.. ఇదంతా కూడా విజయ్ చలవ.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper