టీకా: ఇజ్రాయెల్ సాధించింది.. ఇండియాకేమైంది?

ఇజ్రాయిల్.. చిన్న దేశం.. మన భారత్ లో ఒక రాష్ట్రం అంత ఉంటుంది. కానీ టెక్నాలజీలో భారత్ కే ఆయుధాలు, రక్షణ సామగ్రి అందుతోంది. అందరిలాగానే మొదటి కరోనా వేవ్ తో అల్లకల్లోలమైంది. కానీ ఇప్పుడు ఆదేశంలో మాస్క్ లేకుండా తిరిగేలా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే కరోనాను నియంత్రించింది. సంవత్సరంలోనే సంగమందికి కరోనా టీకా వేసి రోగనిరోధక శక్తిని పెంచింది. అవును భారత్ లోనే ఇన్ని టీకాలు తయారీ.. ఔషధ రంగ అగ్రగామిగా ఉండి.. ప్రపంచానికి […]

Written By: NARESH, Updated On : April 23, 2021 12:51 pm
Follow us on

ఇజ్రాయిల్.. చిన్న దేశం.. మన భారత్ లో ఒక రాష్ట్రం అంత ఉంటుంది. కానీ టెక్నాలజీలో భారత్ కే ఆయుధాలు, రక్షణ సామగ్రి అందుతోంది. అందరిలాగానే మొదటి కరోనా వేవ్ తో అల్లకల్లోలమైంది. కానీ ఇప్పుడు ఆదేశంలో మాస్క్ లేకుండా తిరిగేలా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే కరోనాను నియంత్రించింది. సంవత్సరంలోనే సంగమందికి కరోనా టీకా వేసి రోగనిరోధక శక్తిని పెంచింది.

అవును భారత్ లోనే ఇన్ని టీకాలు తయారీ.. ఔషధ రంగ అగ్రగామిగా ఉండి.. ప్రపంచానికి టీకాలు పంపిణి చేస్తున్న భారతదేశం చేయలేని పనిని ఒక చిన్న దేశం చేసి చూపించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. భారత్ ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఉంది.

కరోనా సెకండ్ వేవ్ వస్తుందని గుర్తించిన ఇజ్రాయెల్ దేశం ఎంతో ముందు చూపుతో ప్రజలకు టీకాలను ఉచితంగా పంపిణీ చేసింది. జనాభాలో 16 ఏళ్లలోపు వారిని మినహాయించి సగం మందికి పంపిణీ చేసింది. ఇజ్రాయెల్ దేశంలో మొదటిడోసు టీకా తీసుకున్నవారు 60శాతం మందికాగా.. రెండు డోసులు వేయించుకున్న వారు 56శాతం మంది ఉన్నారు.

ఇక అమెరికాకు చెందిన ప్రఖ్యాత టీకాలు ఫైజర్, బయోఎన్ టెక్ టీకాలను కొనుగోలు చేసి మరీ ప్రజలకు అందించారు. ప్రపంచంలోనే రిలీజ్అయిన మొట్టమొదటి టీకాలు ఇవే.. వీటిని కొనుగోలు చేసి మరీ ప్రజలకు అందించింది. తాజాగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మేం ప్రపంచానికి మార్గదర్శకులం అయ్యాం’ అని ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.

ఇక దేశంలో అందుబాటులోకి వచ్చిన టీకాలను మాత్రం మోడీ సర్కార్ పేరు, పరపతి కోసం పక్క దేశాలకు పంపిణీ చేసింది. ఈ పొరపాటు చేయకుండా వాటన్నింటిని ఇప్పుడు దేశ ప్రజలకు కనుక పంచి ఉంటే పరిస్థితి దేశంలో ఇంత దారుణంగా ఉండేది కాదని అంటున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని చూసి అయినా నేర్చుకోవాలని ఇండియాలోని మోడీ సర్కార్ ను పలువురు కోరుతున్నారు.