https://oktelugu.com/

ఒంటరి తనాన్ని పోగొట్టుకోవడానికే అతన్ని ప్రేమిస్తోంది !

గోవా సుంద‌రి ఇలియానాకి ఎఫైర్లు కొత్తేమి కాదు. చాలా కాలం తన విదేశీ బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేసి.. అతనితో చాల దూరం వెళ్లిందని ఆమె పై అనేక కథనాలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అయినా, ఇల్లి బేబీ మాత్రం ఇలాంటి ఆరోపణలను పెద్దగా పట్టించుకోదు. అయితే తన విదేశీ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి కూడా చేసుకుంది అని అంటారు. కానీ ఆ విషయంలో ఇలియానా ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతానికి ఐతే […]

Written By:
  • admin
  • , Updated On : April 23, 2021 / 12:34 PM IST
    Follow us on

    గోవా సుంద‌రి ఇలియానాకి ఎఫైర్లు కొత్తేమి కాదు. చాలా కాలం తన విదేశీ బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేసి.. అతనితో చాల దూరం వెళ్లిందని ఆమె పై అనేక కథనాలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అయినా, ఇల్లి బేబీ మాత్రం ఇలాంటి ఆరోపణలను పెద్దగా పట్టించుకోదు. అయితే తన విదేశీ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి కూడా చేసుకుంది అని అంటారు. కానీ ఆ విషయంలో ఇలియానా ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతానికి ఐతే ఇలియానా ఒంటరి. రెండేళ్ల క్రితం విదేశీ ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది.

    మళ్ళీ సినిమాల పై ఫోకస్ పెట్టింది. కానీ ఎవ్వరూ ఈ బ్యూటీని పట్టించుకోలేదు. ఛాన్స్ లు ఇవ్వలేదు. అయితే ఛాన్స్ లతో తనకు సంబంధం లేదని.. తానూ ఎప్పుడు ఇండస్ట్రీకి స్పెషలే అన్నట్టు ఉందట ఇలియానా వ్యవహార శైలి. ఇక ఆమె సినిమా ఛాన్స్ లను పక్కన పెడితే.. రెండేళ్ల తర్వాత ఆమె లవ్ లైఫ్ గురించి మళ్ళీ పుకార్లు షికార్లు మొదలైపోయాయి. ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ కి చెందిన ఒక ఫేమస్ పర్సనాలిటీతో లవ్ లో ముగుని తేలుతూ ఉందని ఆ పుకార్ల సారాంశం.

    అయినా 34 ఏళ్ల ఇల్లి బ్యూటీ మాత్రం ఎన్నాళ్ళు అని ఒంటరిగా ఉంటుంది. ఇదే విషయాన్ని తన సన్నిహితులతో అంటూ ఉంటుందట ఇలియానా. తానూ మనిషినే అని తనకు కోరికలు ఉంటాయని.. అందరిలానే తానూ కొన్ని విషయాల్లో తప్పులు చేస్తానని వాటిని పెద్ద తప్పులుగా భావించ వద్దు అని ఇలియానా తన ప్రేమ వ్యవహారాల గురించి చెప్పుకుంటూ పోతుందట. ఎలాగూ వెబ్ సిరీస్ లు, చిన్నాచితకా సినిమాలతో కెరీర్ పూర్తిగా బాలీవుడ్ లోనే కొనసాగుతోంది కాబట్టి, బాలీవుడ్ లోని ప్రముఖ వ్యక్తినే ప్రియుడిగా చేసుకుంది.

    నిజానికి ఎప్పుడో నాలుగేళ్ళ క్రితమే ఈ గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. విదేశీ ప్రియుడిని వదిలేసిన తరువాత గోవాకి చెందిన ఒక బిజినెస్ మెన్ తో కొన్నాళ్ళు కలిసి ఉందని.. ఆ తరువాత కొన్నాళ్ళు ఒక సీనియర్ హీరోతో కూడా ఎఫైర్ నడిపిందని ఇలా చాలానే రూమర్లు వచ్చాయి. మొత్తనికి ఇలా చాలామందికి దూరమైపోయినా ఇల్లి పాప చివరకు సింగిల్ గానే మిగిలిపోయింది. ఆ ఒంటరి తనాన్ని పోగొట్టుకోవడానికే ప్రస్తుతం ఓ బాలీవుడ్‌ ప్రముఖుడితో ఈ సొగసైన అమ్మ‌డు ప్రేమను నడుపుతుంది.