https://oktelugu.com/

కేసీఆర్ ను పొగిడి.. నాలుక్కరుచుకొని తిట్టిన వీహెచ్

మన పెద్దలు వీ హనుమంతరావు తెలంగాణ యాసలో తిట్టినా ఎంతో ముద్దుగానే అనిపిస్తది. ఆయన యాస, భాష ముచ్చటేస్తది. ఇటీవల రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా వద్దన్న వీహెచ్.. చివరకు రేవంత్ స్వయంగా తను అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రికి వచ్చి పరామర్శించడంతో కూల్ అయిపోయాడు. ఎప్పుడు కోపం ప్రదర్శిస్తాడో? ఎప్పుడు కూల్ అయిపోతాడో తెలియని వింత పెద్ద మనిషిగా వీహెచ్ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా తాజాగా మన వీహెచ్ అలానే ప్రవర్తించాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 28, 2021 5:50 pm
    Follow us on

    V.Hanumantarao Comments on KCR

    మన పెద్దలు వీ హనుమంతరావు తెలంగాణ యాసలో తిట్టినా ఎంతో ముద్దుగానే అనిపిస్తది. ఆయన యాస, భాష ముచ్చటేస్తది. ఇటీవల రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా వద్దన్న వీహెచ్.. చివరకు రేవంత్ స్వయంగా తను అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రికి వచ్చి పరామర్శించడంతో కూల్ అయిపోయాడు. ఎప్పుడు కోపం ప్రదర్శిస్తాడో? ఎప్పుడు కూల్ అయిపోతాడో తెలియని వింత పెద్ద మనిషిగా వీహెచ్ ఉన్నారు.

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా తాజాగా మన వీహెచ్ అలానే ప్రవర్తించాడు. కేసీఆర్ వీహెచ్ కొద్దిసేపు ప్రశంసలు కురిపించారు. ‘దళిత బంధు’ పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని అభినందించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన వీహెచ్.. ‘దళితులు.. ధనికులు కావాలనే సీఎం కేసీఆర్ ఆలోచన బాగుంది. ఈ  ఏడేళ్లలో అంబేద్కర్ ఫొటోకు పూలమాల వేయడం చూస్తున్నా.. రాష్ట్రంలో దళితులందరికీ పది లక్షలు ఇస్తేనే కేసీఆర్ దళిత బాంధవుడు’  అని తన ప్రత్యర్థి పార్టీ అధినేతను పొగడడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    ఇక కాంగ్రెస్ నేతలు ఏంది వీహెచ్ అన్నా కాంగ్రెస్ లో ఉండి కేసీఆర్ ను పొగుడుతావ్ అని అడిగే సరికి నాలుక కరుచుకున్నాడు.. కేసీఆర్ పై విమర్శలు చేశాడు. ‘అంబేద్కర్ విగ్రహాన్ని హుజూరాబాద్ లో లాకప్ లో పెట్టాడని’ విమర్శించారు. దళితులకు భోజనం పెట్టి.. ఫొటోకు దండవేస్తే అంబేద్కర్ పై చిత్తశుద్ధి ఉన్నట్లు కాదని కేసీఆర్ పై విమర్శించారు. కస్టడీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఇవ్వకపోతే సీఎం కేసీఆర్ ది దళితులపై కపట ప్రేమగా భావిస్తామని వీహెచ్ పేర్కొన్నారు.

    ఇలా ఒకే సమయంలో కేసీఆర్ ను పొగిడి.. ఆ తర్వాత తిట్టి వీహెచ్ ప్రవర్తించిన తీరు నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. వీహెచ్ ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో.. పెద్దాయనకు ఏమైందోనని అందరూ ఆరాతీస్తున్నారు.