మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానంలోని స్థానిక ఆలయాల విలువలను అందరికి తెలియజేసి భక్తుల సంఖ్య పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజెప్పే ఉద్దేశంతో స్థల పురాణాలు ప్రచారం చేసి పర్యాటక, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పని చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆలయాల చరిత్రను ప్రచారం చేసే నిమిత్తం టీటీడీ వెబ్ సైట్, శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సంకల్పించారు. తిరుపతిలో భక్తులు బస చేసే […]

Written By: Srinivas, Updated On : July 28, 2021 4:35 pm
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానంలోని స్థానిక ఆలయాల విలువలను అందరికి తెలియజేసి భక్తుల సంఖ్య పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజెప్పే ఉద్దేశంతో స్థల పురాణాలు ప్రచారం చేసి పర్యాటక, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పని చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆలయాల చరిత్రను ప్రచారం చేసే నిమిత్తం టీటీడీ వెబ్ సైట్, శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సంకల్పించారు. తిరుపతిలో భక్తులు బస చేసే నివాసాల వద్ద ప్రచార హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని భావించింది. ఇప్పటికే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఆలయాల గురించి ప్రచారం చేసేందుకు పర్యాటక, ఆర్టీసీ అధికారులు ప్యాకేజీ టూర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.

అవసరాలను బట్టి సేవలు విస్తరించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ చరిత్రపై ఓ పుస్తకం తయారు చేసి ఎప్పటికప్పుడు సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్న ఆలయాల ప్రాభవంపై ప్రాధాన్యం కలిగేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక దేవాలయాలను తీర్థయాత్ర స్థలాలుగా మార్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట ఆలయంలో కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని చూస్తోంది.

ఆలయాలకు కానుకగా వచ్చే గోవులను రక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచిస్తోంది. ఆలయంకు సంబంధించిన వ్యవసాయ భూములలో పండించిన పంటలు ఆలయ ప్రసాదాల తయారుకు ఉపయోగించుకునేలా చూస్తున్నారు. ఆలయాలకు వచ్చే ఆదాయం, భక్తుల సంఖ్యను బట్టి గ్రేడ్లుగా విభజించాలని భావిస్తోంది. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొంది. తిరుమల పర్యాటక శాఖ అభివృద్ధికి భక్తులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా దేవాలయాల ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేయాలని నిర్ణయించింది.