Sri Lanka Crisis- India: ద్వీప దేశం శ్రీలంకను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇందుకు భారత ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేస్తోందా? సేఫ్ జోన్ లో తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. అటు భారత ప్రభుత్వం చర్యలు కూడా నిజం చేస్తున్నాయి. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు అనేక ముఖ్యమైన రంగాలు, ఇతర రంగాల్లో శ్రీలంక రూపాయికి బదులుగా భారత రూపాయిని ఉపయోగించాలని నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచ దేశాలతో వాణిజ్యం సులభతరం చేయడానికి రూపాయిల్లో చెల్లింపులు చేసేందుకు అనుమతిచ్చింది. ఇరాన్, రష్యా వంటి దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలకు ఇది ఎంతగానో దోహదపడింది.దానికి అనుగుణంగా ఎగుమతులు, దిగుమతులు, వాణజ్య ప్రయోజనాలు కలుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన తాజా వెసులబాటు వల్ల భారత కరెన్సీ రూపాయి పతనం విలువ నుంచి కాపాడుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల విదేశీ మారకద్రవ్య ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చునని భావిస్తున్నారు. అదే సమయంలో ఈ నిర్ణయం ఆర్థికంగా కుదేలైన శ్రీలంకను కష్టాల నుంచి గట్టెక్కవచ్చని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. రోజు రోజుకూ దిగజారుతున్న అక్కడి ఆర్థిక వ్యవస్థను, వాణిజ్యాన్ని గాడిలో పెట్టవచ్చని భావిస్తున్నారు.
అనుకోని అవకాశం..
కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఆర్బీఐ చేపట్టిన రూపాయి చెల్లింపు విధానమనేది రష్యా, ఇరాన్ వంటి దేశాలకే కాదు. దాదాపు భారత్ తో దైపాక్షిక ఒప్పందాలు, వ్యాపార, వాణిజ్యలు చేస్తున్న అన్ని దేశాలకూ ఇది లాభించేదే. అయితే ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంకు ఇది ఒక గొప్పవరంగా పరిణమించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శ్రీలంక ఆర్థిక పరిస్థితి గడ్డుకాలంలో ఉండడంతో భారత్ కరెన్సీరూపాయితో పోల్చుకుంటే అక్కడి రూపాయి విలువ రూ.0.22కు పడిపోయింది.
Also Read: Venkaiah Naidu: బీజేపీలో వెంక్యయ్య నాయుడు పాత్ర ముగిసినట్టేనా?
అందుకే శ్రీలంక ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఆ దేశం రూపాయి స్థానంలో మన దేశం రూపాయిని చలామణిలో తేవడానికి నిర్ణయించినట్టు సమాచారం. కొవిడ్ సమయం నుంచే శ్రీలంక ఆర్థిక పరిస్థితి దిగజారింది.2020లో అయితే మైనస్ 3.5 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది ఏకంగా మైనస్ ఆరు శాతానికి దిగజారింది. ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్న తరుణంలో కనీసం గాడిలో పెట్టే ప్రయత్నాలకు అవరోధం కలుగుతుందని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నందలాల్ వీరసింగ్ చెబుతున్నారు.
కరెన్సీ పై భిన్న వ్యాఖ్యలు..
శ్రీలంక కరెన్సీ మార్పిడి నిర్ణయంతో ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుందని అక్కడి నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా వాణిజ్య వ్యవస్థ మెరుగుపడడానికి ఇదో చక్కటి అవకాశంగా పేర్కొంటున్నారు. కొత్త పెట్టుబడులు ఆకర్షించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. భారత కరెన్సీ వినియోగించినప్పుడు, చెల్లింపులు చేసినప్పుడు విదేశీ మారకద్రవ్య విలువలు చాలావరకూ ఆదా అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే దీనిపై స్వదేశంలో భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్థిక నిపుణులు ఆహ్వానిస్తుండగా..రాజకీయ పార్టీల నేతలు మాత్రం తప్పుపడుతున్నారు. ఒక దేశంలో రెండు కరెన్సీలు అమలుచేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది మరింత జఠిలం చేసే అంశంగా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జింబాబ్వేతో పాటు పలు దేశాల్లో కరెన్సీ విధానం ఉందని కూడా కొందరు గుర్తుచేస్తున్నారు. శ్రీలంక ఇప్పుడున్న పరిస్థితులోఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే ఇదే కరెక్టని భావిస్తున్నారు.
Also Read:Cheetahs to prowl India : 70 ఏళ్ల తర్వాత భారత్ లోకి చిరుతలు.. ఈ రాజుల వేటతోనే అంతరించిపోయాయి!