Venkatesh- Aishwarya Rai: మన టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి ఉన్న స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మాస్ , క్లాస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు వెంకటేష్ సినిమా చూడండి థియేటర్స్ కి కదులుతాడు..ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కి ఉన్న క్రేజ్ ని మ్యాచ్ చేసే హీరో ఇప్పటికి రాలేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు..60 ఏళ్ళ వయస్సు వచ్చిన కూడా ఇప్పటికి స్టార్ హీరోలతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడగలే సత్తా ఉన్న హీరో వెంకటేష్..ఆయనని ఈ స్థాయిలో నిలబెట్టడానికి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సహాయపడ్డాయి..అప్పట్లో వెంకటేష్ కి ఉన్న క్లాసికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఏ హీరో కి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఆయనని మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమాలలో ఒకటి ప్రేమించుకుందాం రా అనే చిత్రం..ఫ్యాక్షన్ లవ్ స్టోరీ నేపథ్యం లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ప్రభంజనం..ముఖ్యం ఈ చిత్రం లోని పాటలు యూత్ ని ఒక ఊపు ఊపేసాయి..ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి..అవేమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలి ఝవేరి నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా హిట్టైన తర్వాత ఆమె క్రేజ్ టాలీవుడ్ ఒక రేంజ్ కి వెళ్ళింది..అయితే ఈ సినిమా లో తొలుత అంజలి ఝవేరి కి బదులుగా విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ ని అనుకున్నారట..ఆ చిత్ర దర్శకుడు జయంత్ సి పరాన్జీ కి ఐశ్వర్య రాయ్ తో మంచి సాన్నిహిత్యం ఉండడం వల్ల ఈ చిత్రం లో ఆమెని హీరోయిన్ గా తీసుకునేందుకు సన్నాహాలు చేసాడు..అయితే ఐశ్వర్య రాయ్ అప్పటికే అరడజను సినిమాలకు పైగా కమిట్మెంట్ ఇచ్చేసింది..డేట్స్ ఖాళీగా లేవు..ఆమె కోసం గా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ పోతుంది..అవతల ఈ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ కేటాయించిన డేట్స్ అయిపోతున్నాయి.
Also Read: Producers Worried About Extra Cost: హీరోల అదనపు ఖర్చులకు నిర్మాతలు గగ్గోలు

ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించే సమయం కూడా వచ్చేస్తుంది..ఐశ్వర్య రాయ్ డేట్స్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండడం తో ఆమెని కాదని అంజలి ఝవేరి ని హీరోయిన్ గా తీసుకోవాలని జయంత్ సి పరాన్జీ కి వెంకటేష్ సూచించారు..ఇక చేసేది ఏమి లేక వెంకటేష్ చెప్పినట్టు అంజలి ఝవేరి ని హీరోయిన్ గా తీసుకొని సెన్సషనల్ హిట్ కొట్టారు..ఈ సినిమా అప్పట్లోనే దాదాపుగా 20 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టినట్టు సమాచారం..వెంకటేష్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయిన ఈ చిత్రం వచ్చి సరిగ్గా పాతికేళ్ళు అయ్యింది.
Also Read:Liger Trailer: లయన్ కు, టైగర్ కు పుట్టిన క్రాస్ బీడ్ ‘లైగర్’.. ‘దేవరకొండ’ యాక్షన్ విశ్వరూపం