https://oktelugu.com/

బీజేపీ వ్యూహాల వెనుక ‘టీవీ9’ మాజీ సీఈవో?

బ్రేకింగ్ న్యూస్‌లకు.. సంచలనాలకు కేరాఫ్‌ అయిన టీవీ9కు మాజీ సీఈవో రవిప్రకాష్‌. టీవీ9 తక్కువ టైంలోనే టాప్‌ రేంజ్‌కు తీసుకొచ్చిన క్రెడిట్‌ అంతా ఆయనదే. పలు కారణాల వల్ల ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడు రాజ్‌న్యూస్‌ బాధ్యతలు తీసుకున్నారు. తెర ముందుకు రాకున్నా ఇప్పుడు ఆ చానల్‌లో మారిపోయిన వార్తా సరళిని చూస్తే.. రవిప్రకాష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి మద్దతుగా ఏకపక్షంగా నడిపిస్తున్నారు. ఆ చానల్‌కు ఫండింగ్ ఏ బీజేపీ నేతో తెలియదు కానీ.. రవిప్రకాష్ […]

Written By: , Updated On : November 27, 2020 / 12:16 PM IST
Follow us on

బ్రేకింగ్ న్యూస్‌లకు.. సంచలనాలకు కేరాఫ్‌ అయిన టీవీ9కు మాజీ సీఈవో రవిప్రకాష్‌. టీవీ9 తక్కువ టైంలోనే టాప్‌ రేంజ్‌కు తీసుకొచ్చిన క్రెడిట్‌ అంతా ఆయనదే. పలు కారణాల వల్ల ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడు రాజ్‌న్యూస్‌ బాధ్యతలు తీసుకున్నారు. తెర ముందుకు రాకున్నా ఇప్పుడు ఆ చానల్‌లో మారిపోయిన వార్తా సరళిని చూస్తే.. రవిప్రకాష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి మద్దతుగా ఏకపక్షంగా నడిపిస్తున్నారు. ఆ చానల్‌కు ఫండింగ్ ఏ బీజేపీ నేతో తెలియదు కానీ.. రవిప్రకాష్ వ్యూహాల్ని.. ఎన్నికలకు కూడా వాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: గ్రేటర్‌‌ బరి నుంచి జనసేన అందుకే తప్పుకుందా..?

దుబ్బాక ఉపఎన్నికల విషయంలోనూ రవిప్రకాష్ ఇచ్చిన సలహాలు వర్కవుట్ చేసినట్లు సమాచారం. అందుకే.. గ్రేటర్ ఎన్నికల్లో మరింతగా ఆయనను ఇన్వాల్వ్ చేస్తున్నారని చెబుతున్నారు. గ్రేటర్‌లో ఎలాంటి ప్లాన్లు అమలు చేయాలన్న దానిపై బీజేపీ ముఖ్యనేతలు నిర్వహించే సమావేశాలకు రవిప్రకాష్‌కు కూడా ఆహ్వానం అందుతోందని తెలుస్తోంది. అందుకే.. ఆయన కూడా.. తన వంతు సాయం చేస్తున్నారని చెబుతున్నారు.

రవిప్రకాష్ ముందు నుంచి ప్రజల నాడి తెలిసిన వ్యక్తి. విమర్శలు.. ఎన్ని వచ్చినా.. ప్రజలు మెచ్చే వార్తాంశాలనే ఆయన టీవీ9కు ఎంచుకునేవారు. ఈ క్రమంలో మీడియా విలువలని.. ఇంకొకటని ఆయనపై విరుచుకుపడేవారు. సక్సెస్ కోసం అందరూ అదే దారిలో నడవాల్సిందే. ఎన్ని విమర్శలు చేసినా టీవీ9 దారిలో నడిచి టీఆర్పీలు పెంచుకునేందుకు అన్ని చానళ్లు ప్రయత్నించాయి.

Also Read: టీఆర్‌‌ఎస్‌పై బీజేపీదే లాస్ట్‌ పంచ్‌!

అయితే.. అనుకరణ ఎప్పుడూ అనుకరణే. సక్సెస్ అయిన వారు కొందరే. ఇప్పుడు తన మీడియా సక్సెస్ ఆలోచనలు.. గ్రేటర్‌లో బీజేపీ సక్సెస్ కోసం రవిప్రకాష్ ను వినియోగిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రతీ రోజూ బీజేపీ వార్తల్లో ఉండటానికి ఇదే కారణం అన్న అంచనాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి బీజేపీ భావజాలానికి రవిప్రకాష్‌ భావజాలానికి అసలు సరిపోలదు. కానీ.. రాజకీయంలో బాధితుడిగా మిగిలిన రవిప్రకాష్.. తనను తాను కాపాడుకోవడానికి.. పూర్వ వైభవం పొందడానికి ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు.

TV9 EX CEO Ravi Prakash Behind BJP Strategy..? | GHMC Elections 2020 | Ok Telugu

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్