https://oktelugu.com/

నివర్ ఎఫెక్ట్: ప్రకాశం జిల్లాలో రాకపోకలు బంద్

నివర్ ఎఫెక్ట్ తో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు చోట్ల రాకపోకలను నిలిపివేశారు. పీసీపల్లి మండలం పాలేటిపల్లిలో వరదనీటితో రిజర్వాయర్ నిండిపోయింది. దీంతో వరదనీరు తలకొండపాడు, పడమటపల్లి గ్రామస్థులు తమ ఊళ్లోకి వరదనీరు వచ్చే అవకాశం ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు నెల్లూరు, చిత్తూరులోనూ భారీ వర్షం కురుస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులోని హరిణి ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. తిరుపతి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 27, 2020 / 12:14 PM IST
    Follow us on

    నివర్ ఎఫెక్ట్ తో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు చోట్ల రాకపోకలను నిలిపివేశారు. పీసీపల్లి మండలం పాలేటిపల్లిలో వరదనీటితో రిజర్వాయర్ నిండిపోయింది. దీంతో వరదనీరు తలకొండపాడు, పడమటపల్లి గ్రామస్థులు తమ ఊళ్లోకి వరదనీరు వచ్చే అవకాశం ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు నెల్లూరు, చిత్తూరులోనూ భారీ వర్షం కురుస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులోని హరిణి ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. తిరుపతి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కడపజిల్లా సీకె దిన్నె మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు నాలుగు గేట్లను లేపి నీటిని వదులుతున్నారు.