తాను గీసుకున్న గుండంలో తానే రాజునని.. ఈ గుండంలోకి ఎవరూ రావద్దని అన్నట్లుగా ఉంది ట్రంప్ వ్యవహారం. అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోయినా వైట్ హౌజ్ ను వీడడానికి ఇష్టపడడం లేదు. ఏదో మెలిక పెడుతూ ఓటమిని ఒప్పుకోవడం లేదు. ఏ చిన్న కారణం దొరికినా అందులో అన్యాయం జరిగిందంటూ వాదిస్తున్నాడు.. ఇప్పటి వరకు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వాదించిన ట్రంప్ ఇప్పడు మరోసారి ఈవీఎంలలో, ఎలక్షన్ కు సంబంధించిన కంప్యూటర్ డివైజ్ లలో అవినీతి చోటు చేసుకుందని వాదిస్తున్నాడు.
Also Read: గ్రేటర్ బరి నుంచి జనసేన అందుకే తప్పుకుందా..?
నవంబర్ 2నుంచి సాగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ మొదట్లో కొన్ని చోట్ల విజయం సాధించినా ఓవరాల్ మాత్రం ఆయనకు ఎలక్టోరల్ ఓట్లు 220 లోపే వచ్చాయి. దీంతో 290కి పైగా ఓట్లు సాధించిన బైడెన్ విజయం సాధించాడు. అయితే రిపబ్లికన్లకు అనుకుూలంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లోనూ బైడెన్ విజయం సాధించారు. దీంతో ఆయన జార్జియా, ఫెన్వెలియా రాష్ట్రాల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టుల్లో కేసులు శారు. అయితే కోర్టు తీర్పులు ట్రంప్ నకు వ్యతిరేకంగా వచ్చాయి.
కోర్టు తీర్పులు పదేపదే ట్రంప్ నకు వ్యతిరేకంగా రావడంతో కొన్ని రోజుల కిందట ట్రంప్ ఓటమిని అంగీకరిస్తున్నారని తెలిసింది. అయితే తాజాగా ఈవీఎంలలో అక్రమాలు జరిగాయంటూ వాదిస్తున్నారు. ఇటీవల ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఈవీఎంలు, ఎన్నికలకు సంబంధించిన కంప్యూటర్లను హ్యాక్ చేశారని ఆరోపించారు. రిపబ్లికన్లు బలంగా ఉన్న చోట్ల ఈ హ్యాకింగ్ జరిగిందన్నారు. అలాగే మీడియా, కొన్ని కార్పొరేట్ సంస్థలు తనకు వ్యతిరేకంగా ఉన్నారని, తాను మంచి పనులు చేసినా వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆరోపించారు.
Also Read: టీఆర్‌ఎస్‌పై బీజేపీదే లాస్ట్ పంచ్!
ఇప్పటికీ ట్రంప్ నేనే గెలిచానని ప్రకటించుకుంటున్నారు. ఎలక్టోరల్ కాలేజీ బైడెన్ గెలిచినట్లు ప్రకటించలేదన్నారు. ఎలక్టోరల్ కాలేజీ ప్రకటించిన తరువాతే తాను వైట్ హౌజ్ ను వీడుతానని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిగ్గింగ్ తరమాలో అక్రమాలు జరిగాయని అందువల్ల ఎలక్టోరల్ కాలేజీ బైడెన్ ను విజేతగా ప్రకటించదన్నారు. మొత్తానికి ట్రంప్ అధికా పీఠాన్ని వీడే రోజులు ఎప్పుడు వస్తాయా..? అని బైడెన్ వర్గం ఎదురుచూస్తోంది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు