TTD Board Members: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి నియామక ప్రక్రియ పూర్తయింది.24 మంది సభ్యులతో నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా నియమితులైన సంగతి తెలిసిందే. వై వి సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం కరుణాకర్ రెడ్డిని నియమించింది. తాజాగా 24 మంది సభ్యులను ప్రకటించింది.
ఎమ్మెల్యే కోటాలో జగ్గయ్యపేట శాసనసభ్యుడు సామినేని ఉదయభాను, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి నియమితులయ్యారు. కడపకు చెందిన మాసిమాబాబు,యానాదయ్య,కర్నూలుకు చెందిన సీతారామిరెడ్డి, ఉంగటూరుకు చెందిన సుబ్బరాజు,ఏలూరు కు చెందిన నాగ సత్యం యాదవ్, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధా రాఘవరావు కుమారుడు సుధీర్, అనంతపురానికి చెందిన అశ్వద్ధామ నాయక్,తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి, కర్ణాటకకి చెందిన దేశ్ పాండే, తెలంగాణకు చెందిన శరత్ చంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ కుమార్ సతీమణి సీతా రంజిత్ రెడ్డి,మహారాష్ట్రకు చెందిన ఆమోల్ కాలే, సౌరబ్ బోరా, మిలింద్ నగర్, కేతన్ దేశాయి, బోర సౌరబ్, మేకా శేషుబాబు, రామ్ రెడ్డి సామూల, బాలసుబ్రమణ్యం పాలని స్వామి, ఎస్సార్ విశ్వనాథరెడ్డి తదితరులు నియమితులయ్యారు.
ఈసారి ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి ముగ్గురు సభ్యులను ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం దొరికింది. టిటిడి చైర్మన్ పోస్ట్ ఆశించిన సిద్దా రాఘవరావు కుమారుడికి సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. అటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు వినిపించినా.. కనీసం సభ్యుడిగా కూడా ఎంపిక చేయకపోవడం గమనార్హం. తెలంగాణకు చెందిన శరత్ చంద్రారెడ్డిని ఎంపిక చేయడం విశేషం. ఆయన లిక్కర్ కుంభకోణంలో అరెస్టయ్యారు కూడా. విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయానా సోదరుడు. తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసే విధంగా ఇటీవల నియామకాలు ఉన్నాయంటూ వివిధ ఆధ్యాత్మిక సంఘాలు మండిపడుతున్నాయి.