https://oktelugu.com/

Buchibabu- Ram Charan: రామ్ చరణ్ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు… లాంచింగ్ ఎప్పుడంటే?

రెండో చిత్రానికి రామ్ చరణ్ వంటి టాప్ స్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు బుచ్చిబాబు. ఉప్పెన సక్సెస్ తో ఆయనకు చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే స్టార్ హీరో కోసం ఆయన ఎదురుచూశాడు.

Written By:
  • Shiva
  • , Updated On : August 26, 2023 / 08:38 AM IST

    Buchibabu- Ram Charan

    Follow us on

    Buchibabu- Ram Charan: ఒక్క మూవీతో టాలీవుడ్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. వంద కోట్లకు పైగా వసూళ్లతో భారీ లాభాలు పంచింది. ఈ చిత్ర హీరో హీరోయిన్స్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కెరీర్స్ కి ఉప్పెన మంచి పునాది వేసింది. అనూహ్యంగా ఈ చిత్రం నేషనల్ అవార్డు పొందిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన 69వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన ఎంపికైంది. ఈ క్రమంలో దర్శకుడు బుచ్చిబాబు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తో చేయబోతున్న ప్రాజెక్ట్ పై కీలక విషయాలు వెల్లడించారు. ఈ స్క్రిప్ట్ పై నాలుగేళ్లుగా పని చేస్తున్నానని బుచ్చిబాబు చెప్పాడు. మూవీ అద్భుతంగా ఉంది. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? షూటింగ్ ఎప్పటి నుండి? వంటి ప్రశ్నలకు ఆయన స్పందించారు. ఈ వివరాలు నిర్మాతలు సమయం వచ్చినప్పుడు చెబుతారని బుచ్చిబాబు అన్నారు.

    రెండో చిత్రానికి రామ్ చరణ్ వంటి టాప్ స్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు బుచ్చిబాబు. ఉప్పెన సక్సెస్ తో ఆయనకు చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే స్టార్ హీరో కోసం ఆయన ఎదురుచూశాడు. నిజానికి ఎన్టీఆర్ తో బుచ్చిబాబు మూవీ ఉంటుందని గట్టిగా ప్రచారం జరిగింది. ఎన్టీఆర్-బుచ్చిబాబు కాంబోలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుందని, ఈ మూవీ టైటిల్ పెద్ది అంటూ వార్తలు వచ్చాయి.

    ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ నచ్చినప్పటికీ ఈ కథను రామ్ చరణ్ కి ఎన్టీఆర్ సజెస్ట్ చేశాడని, అందుకే ఆయన బుచ్చిబాబుతో మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడనే వాదన ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరో వంద రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని సమాచారం. గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 షూట్ కూడా చేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ మూవీ ఆలస్యం అవుతుంది. గేమ్ ఛేంజర్ కంప్లీట్ అయితే కానీ రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ చేయరు.