
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత్, ఆసీస్ మధ్య వన్డే పోరు సాగుతోంది. అందరూ మ్యాచ్ పైనే ద్రుష్టి సారించారు. అయితే ఇంతలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ప్ల కార్డు పట్టుకొని పిచ్ లోకి వచ్చాడు. ‘నో బిలియన్ డాలర్ అదానీ లోన్’ అన్న ప్ల కార్డులతో గ్రౌండ్ లోకి రావడంతో కలకలం రేపింది. దీంతో సెక్యూరిటీ వాళ్లు వచ్చి వాళ్లను గ్రౌండ్ బయటకు తీసుకెళ్లారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యండ్ లో భారత ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ చేపట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అదానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇవ్వొద్దంటూ వారు డిమాండ్ చేశారు. అదానీ చేపడుతున్న ప్రాజెక్టుతో పర్యావరణంపై ప్రతికూలత ఏర్పడుతుందని అంటున్నారు.