Train Journey : ట్రైన్ జర్నీ చేస్తున్నవారు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి.. అవేంటంటే?

రిజర్వేషన్ చేసుకున్న సమయానికి ఒక్కోసారి ప్రయాణం చేయకపోవచ్చు. కానీ ఇదే జర్నీని దగ్గరి వారు లేదా బంధువులు వెళ్లాలనుకుంటున్నారు. అప్పుటు మీ టికెట్ ను వారిపేరుకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

Written By: NARESH, Updated On : August 10, 2024 7:56 pm

Film shooting in the trains

Follow us on

Train Journey : భారతదేశంలో రైలు మార్గం చాలా పెద్దది. ఇండియాలో ప్రతిరోజూ 24 మిలియన్ల మంది రైలులో ప్రయాణిస్తున్నట్లు రైల్వే శాఖ తెలుపుతోంది. సూదూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణంచాలంటే రైలు మార్గమై సరైనది. అయితే ట్రైన్ జర్నీ చేసే ముందు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. టికెట్ బుక్ చేసుకోవడం నుంచి ట్రైన్ దిగే వరకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే ఈ జర్నీ సౌకర్యవంతంగా ఉంటుంది. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఎన్నో అసౌకర్యాలను ఎదుర్కొంటాం.

ఒక ట్రైన్ లో రోజుకు వందలాది మంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ఈ క్రమంలో రైలు బోగీల్లో చెత్తా చెదారం పడుతుంది. దీనిని పట్టించుకోకపోతే ఏం చేయాలి? కొందరు ట్రైన్ లో వెళ్లాలనుకునే వారు ఏసీ క్లాస్ బుక్ చేసుకుంటారు. వర్షాకాలం, చలికాలం అయితే పర్వాలేదు. కానీ వేసవిలో ఏసీ లేకపోతే భరించలేం. మరి ట్రైన్ జర్నీ చేసే సమయంలో ఏసీ పనిచేయకపోతే ఏం చేయాలి? ఎవరికి కంప్లయింట్ చేయాలి? ఇలాంటి విషయాలపై చాలా మంది ట్రైన్ టీసీ కి కంప్లయింట్ చేయాలని చూస్తారు. కానీ సరైన సమయంలో టీసీ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాగే ఎంక్వైరీ నెంబర్ కు కాల్ చేద్దామనుకుంటే నెట్ వర్క్ ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో ఈ చిన్న మెసేజ్ చేస్తే సరిపోతుంది. అదేంటో తెలుసుకోండి..

సుదూరం వెళ్లాలనుకునేవారికి కారు, బస్సు ప్రయాణం కంటే ట్రైన్ జర్నీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే అనుకున్న సమయానికి దాదాపుగా చేరుకోవచ్చు. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా నిల్చుని మరీ వెళ్లొచ్చు. అవసరమైన పనులు చేసుకోవచ్చు. బెర్త్ బుక్ చేసుకుంటో నిద్రిస్తూ ప్రయాణం చేయొచ్చు. అయినా ట్రైన్ పరిశుభ్రత విషయంలో ఒక్కోసారి సిబ్బంది పట్టించుకోకపోవచ్చు. ట్రైన్ లో చెత్తా చెదారం ఉంటే క్లీన్ చేయొకపోవచ్చు. ఇలాంటి సమయంలో 9200003232 అనే నెంబర్ కు ఎస్ ఎంఎస్ చేయాలి. అయితే ఈ మెసేజ్ చేసేటప్పుడు ముందు PNR టైప్ చేయాలి. ఆ తరువాత ఆ తరువాత స్పేస్ ఇచ్చి టికెట్ పై ఉన్న పీఎన్ ఆర్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. అప్పడు ఈ సమాచారం రైల్వే సిబ్బందికి వెళ్తుంది. దీంతో వారు వచ్చి క్లీన్ చేస్తారు. అలాగే ఏసీ పనిచేయకపోయినా, చార్జీంగ్ పోర్టులు పనిచేయకపోయినా ఈ నెంబర్ కు కంప్లయింట్ ఇవ్వడం ద్వారా వారు స్పందిస్తారు.

రిజర్వేషన్ చేసుకున్న సమయానికి ఒక్కోసారి ప్రయాణం చేయకపోవచ్చు. కానీ ఇదే జర్నీని దగ్గరి వారు లేదా బంధువులు వెళ్లాలనుకుంటున్నారు. అప్పుటు మీ టికెట్ ను వారిపేరుకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అయితే ఎవరికి అయితే ఈ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారో.. వారు ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి. అయితే ఈ పని ట్రైన్ బయలు దేరే 24 గంటల ముందే చేయాలి. ఇందు కోసం ఎవరికి ట్రైన టికెట్ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారో వారి ఆధార్ కార్డు ఇవ్వాలి. వారు డీటేయిల్స్ తెలుసుకొని టికెట్ ను ట్రాన్స్ ఫర్ చేస్తారు.