https://oktelugu.com/

Bigg boss telugu 8 : ముగ్గురు ముద్దుగుమ్మలు, అందులో ఒక హాట్ బ్యూటీ… బిగ్ బాస్ హౌస్లోకి ఆ నలుగురు వెళ్లడం పక్కా!

బిగ్ బాస్ టీం నుండి ఈ నలుగురికి అధికారిక సమాచారం అందిందట. రీతూ చౌదరి జబర్దస్త్ కమెడియన్ గా, హాట్ యాంకర్ గా సుపరిచితమే. అమర్ దీప్ భార్య తేజస్విని హౌస్లో అడుగుపెడుతుందన్న న్యూస్ ఆసక్తి రేపుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 10, 2024 / 07:42 PM IST

    Bigg Boss 8 Telugu

    Follow us on

    Bigg boss telugu 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు ప్రోమోలు విడుదలయ్యాయి. ఒకటి లోగో లాంచ్ ప్రోమో కాగా, మరొక ప్రోమో కాన్సెప్ట్ ప్రధానంగా విడుదల చేశారు. రెండు ప్రోమోలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. దీంతో సీజన్ 8 పై సోషల్ మీడియాలో ఫుల్ బజ్ క్రియేటైంది. త్వరలో షో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అధికారిక తేదీ ప్రకటించకుండా… కమింగ్ సూన్ అంటూ ఊరిస్తున్నారు. ఎనిమిదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అఫీషియల్ ప్రకటన కోసం బీబీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అత్యంత ఆదరణ దక్కించుకుంది. టాప్ టీఆర్పీ తో దేశంలోనే నెంబర్ వన్ షో గా నిలిచింది. ఈ జోష్ లో సీజన్ 8 మరింత ప్రత్యేకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

    అనధికారిక సమాచారం సెప్టెంబర్ 8న ప్రారంభం కానుందట. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సెప్టెంబర్ 1వ తేదీన ముగియనుందట. ఆ నెక్స్ట్ వీక్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఉంటుందని విశ్వసనీయ సమాచారం. వరుసగా ఐదో సారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. సీజన్ 3లో మొదలైన ఆయన ప్రస్థానం కొనసాగుతుంది. మొదటి రెండు సీజన్స్ కి ఎన్టీఆర్, నాని హోస్ట్స్ గా వ్యవహరించారు.

    ఇక లేటెస్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరు సెలెబ్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుంది.కాగా ఓ నలుగురు కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారట. మేకర్స్ వారికి మెయిల్స్ కూడా పంపారట. ఇంతకీ ఆ కన్ఫర్మ్ అయినటువంటి సభ్యులు ఎవరని పరిశీలిస్తే .. రీతూ చౌదరి, అంజలి పవన్, తేజస్విని గౌడ, బంచిక్ బబ్లు బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారట.

    బిగ్ బాస్ టీం నుండి ఈ నలుగురికి అధికారిక సమాచారం అందిందట. రీతూ చౌదరి జబర్దస్త్ కమెడియన్ గా, హాట్ యాంకర్ గా సుపరిచితమే. అమర్ దీప్ భార్య తేజస్విని హౌస్లో అడుగుపెడుతుందన్న న్యూస్ ఆసక్తి రేపుతోంది. చాలా కాలంగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్న బంచిక్ బబ్లు అందరికీ సుపరిచితుడే. ఇక అంజలి పవన్ యాంకర్ కమ్ సీరియల్ నటి. బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన ఫేస్.

    కాగా నటి హేమ, మై విలేజ్ షో అనిల్, బర్రె లెక్క, కుమారి ఆంటీ, యాంకర్ వింధ్య, సింగర్ సాకేత్, ఫార్మింగ్ నేత్ర, కిర్రాక్ ఆర్పీ, గాయత్రి గుప్తా, నటుడు ఇంద్రనీల్, యాదమరాజు, హీరో అబ్బాస్, రోహిత్, ఊర్మిళ చౌహాన్ వంటి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందరూ కాకపోయినా వీరిలో చాలా వరకు బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేసే అవకాశం కలదని సమాచారం.