Chandrababu: చంద్రబాబు కేసుల్లో నేడే కీలకం.. ఏం జరగనుందో?

స్కిల్ స్కాంతో పాటు చంద్రబాబుపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పైనా.. సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీం నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.

Written By: Dharma, Updated On : January 17, 2024 2:35 pm

Chandrababu

Follow us on

Chandrababu: ఎన్నికల ముంగిట చంద్రబాబుపై నమోదైన కేసుల విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. న్యాయమూర్తులు భిన్న తీర్పులు ఇచ్చారు.ఒకరు చంద్రబాబుకు అనుకూలంగా,మరొకరు సిఐడి కి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీంతో ఈ కేసు చీఫ్ జస్టిస్ ముందుకు వెళ్లనుంది. ఆయన ఆదేశాల మేరకు మరోసారి విచారణ జరగనుంది. అంటే దాదాపు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

స్కిల్ స్కాంతో పాటు చంద్రబాబుపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పైనా.. సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీం నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. మరోవైపు స్కిల్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైనా ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో దానిని మరో ధర్మాసనానికి పంపించాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో ఫైబర్ నెట్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.

అయితే చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై ప్రతిష్ఠంభన ఏర్పడిన నేపథ్యంలో.. అప్పటివరకు అరెస్టు వద్దని ఆదేశాలిస్తారా? లేకుంటే ముందస్తు బెయిల్ ఇస్తారా? ఇతరత్రా ఆదేశాలు ఇస్తారా అన్నది ఉత్కంఠ గా మారింది. ఫైబర్ నెట్ కేసులో సుప్రీం ఇవ్వబోయే తీర్పు కూడా ఉత్కంఠ పెంచుతోంది. ఈ కేసు తప్ప మిగిలిన కేసుల్లో చంద్రబాబుకు ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ కేసులో కానీ విముక్తి లభిస్తే చంద్రబాబుకు ఎన్నికల అయ్యే వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఇప్పటికే ఆయన క్షణం తీరిక లేకుండా ఎన్నికల వ్యూహాల్లో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు దాదాపు 22 బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. ఫిబ్రవరి నుంచి అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడిపే అవకాశం ఉంది. ఫైబర్ నెట్ కేసులో మాత్రం బెయిల్ లభిస్తే.. కొన్ని నెలల పాటు చంద్రబాబుకు విముక్తి కలిగినట్టే. మరి కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలి.