spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP 4 Rajya Sabha Seats: జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు? మరి ఆశావహుల పరిస్థితి...

AP 4 Rajya Sabha Seats: జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు? మరి ఆశావహుల పరిస్థితి ఏంటి?

AP 4 Rajya Sabha Seats: రాజ్యసభలోని ఏపీకి సంబంధించిన నాలుగు స్థానాలు త్వరలో ఖాళీ కాబోతున్నాయి. వీటిల్లో బీజేపీ తరపున సుజనా చౌదరి, సురేశ్ ప్రభు, టీజీ వెంకటేశ్ తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం కొనసాగుతున్నారు. జూన్ 21వ తేదీన వీరి పదవీకాలం ముగుస్తుంది. ఈ క్రమంలో సీఎం జగన్ వీటిని ఎవరితో భర్తీ చేస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న నాలుగు స్థానాలు వైసీపీకే దక్కుతాయి. సీఎం ఇప్పటికే కొందరి పేర్లను ఖరారు చేశారంటూ టాక్ వినిపిస్తోంది. దీంతో ఆశావహులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.

AP 4 Rajya Sabha Seats
AP 4 Rajya Sabha Seats

సీఎం ఖరారు చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ ఉన్నారు. ఆయనకు రాజ్యసభ స్థానం కేటాయించడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుతం వైసీపీ నుంచి కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని ఎలాగో రెన్యువల్ చేస్తారు. ఇందులో ఎలాంటి సందేశం లేదు. ఇక మిగతా పదవులను ఎవరికి కేటాయిస్తారన్నదే సస్పెన్స్ గా మారింది. వీటిపైనే వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవుల విషయంలో వైసీపీపై ఢిల్లీ నుంచి పైరవీలు, ఒత్తిడి మొదలైందని సమాచారం. గతంలో బీజేపీ తరపు నుంచి నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు లాంటి వారు రాజ్యసభకు ఎన్నికయ్యారు. కొందరు పారిశ్రామిక వేత్తలు సైతం పదవి కోసం తాడెపల్లి క్యాంప్ ఆఫీస్‌కు లైన్ కట్టే చాన్స్ ఉంది.

Also Read: సీఎం కేసీఆర్ వేయబోయే ‘మంత్రం’ అదేనా?

గతంలో వాటిని భర్తీ చేసే విషయంలో అంబానీ సన్నిహితుడైన పారిశ్రామికవేత్త పరమళ్ నత్వానీకి చాన్స్ ఇచ్చారు. ఇక ఆయన వల్ల రాష్ట్రానికి వచ్చిన లాభమేమీ లేదు. దీని కారణంగానే ఈ సారి పారిశ్రామిక వేత్తలకు చాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని కొందరు చెబుతున్నారు. మరి భర్తీ విషయంలో నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు పేరు సైతం వినిపిస్తోంది.

కానీ ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎక్కువగానే ఉంది.ఎందుకుంటే విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డికి పక్కన పెట్టి మస్తాన్‌రావుకు పదవి ఇస్తే పార్టీలో అసంతృప్తి వచ్చే చాన్స్ ఉంది. మస్తాన్ రావుకు పదవి ఇవ్వొద్దని బీసీ కోటాలో ఇప్పటికే రాజ్యసభ పదవులు ఇప్పటికే కొందరికి వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

Also Read: రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న బీజేపీ ప్లాన్ లో కేసీఆర్ భాగమా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

America Politics

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper