https://oktelugu.com/

రాజధానిలో పులి సంచారం.. నిజమెంత?

హైద్రాబాద్ లోని బంజారహిల్స్‌ లో రోడ్డుపైన పులి సంచరించిందని ఈ రోజు ఉదయం నుంచి ఓ వీడియో వైరల్‌ అయింది. బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుత్రి రూట్‌ లో కేబీఆర్‌పార్క్‌ నుంచి పులి రోడ్డు దాటిందని వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌ లలో వీడియో పోస్ట్‌ చేయడంతో విపరీతంగా వైరల్‌ అయింది. కొన్ని వెబ్‌ సైట్లలో సైతం వార్త రాసి వీడియోను అప్‌ లోడ్‌ చేశారు. దింతో క్షణాల్లో ఈ వీడియోను సోషల్‌మీడియాలో వీపరీతంగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 21, 2020 / 08:05 PM IST
    Follow us on

    హైద్రాబాద్ లోని బంజారహిల్స్‌ లో రోడ్డుపైన పులి సంచరించిందని ఈ రోజు ఉదయం నుంచి ఓ వీడియో వైరల్‌ అయింది. బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుత్రి రూట్‌ లో కేబీఆర్‌పార్క్‌ నుంచి పులి రోడ్డు దాటిందని వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌ లలో వీడియో పోస్ట్‌ చేయడంతో విపరీతంగా వైరల్‌ అయింది. కొన్ని వెబ్‌ సైట్లలో సైతం వార్త రాసి వీడియోను అప్‌ లోడ్‌ చేశారు. దింతో క్షణాల్లో ఈ వీడియోను సోషల్‌మీడియాలో వీపరీతంగా షేర్‌ చేశారు.

    విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని తీసుకుని చెక్‌ చేశారు. అసలు ఎక్కడా కూడా పులి సంచరించలేదని అధికారులు తేల్చి చెప్పారు. ఆ వీడియో ఇక్కడిది కాదని, తిరుమల కొండల్లోనిది అయుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ వీడియోను షేర్‌ చేసినవారికి పోలీసులు వార్నింగ్‌ కూడా ఇచ్చారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరైనా ఇలాంటి వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.