https://oktelugu.com/

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచన!

కరోనా వైరస్ భారిన పడి ఆసుపత్రి లో చేరిన వారికి వైద్య సేవలందిస్తున్న వైద్యులకు తప్పనిసరిగా మాస్క్‌ లు, పీపీ కిట్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. జన సమూహాన్ని తగ్గించడానికి ప్రతి కాలనీలో మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో కరోనా నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి  జిల్లాలో ప్రత్యేక  కేంద్రాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా మహామ్మరిని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 22, 2020 11:55 am
    Follow us on


    కరోనా వైరస్ భారిన పడి ఆసుపత్రి లో చేరిన వారికి వైద్య సేవలందిస్తున్న వైద్యులకు తప్పనిసరిగా మాస్క్‌ లు, పీపీ కిట్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. జన సమూహాన్ని తగ్గించడానికి ప్రతి కాలనీలో మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో కరోనా నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి  జిల్లాలో ప్రత్యేక  కేంద్రాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

    కరోనా మహామ్మరిని కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా 329 కంటైన్మెంట్ ప్రాంతాలను ఏర్పాటు చేశారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై మరోసారి పూర్తి వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 8కి కోర్టు వాయిదా వేసింది.