https://oktelugu.com/

పుష్ప చిత్రంలో రెండో హీరోయిన్ గా నివేదా థామస్‌

2016 లో మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ` జెంటిల్మన్ ` చిత్రం లో నాని సరసన హీరోయిన్ గా నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించు కొన్న నివేదా థామస్‌ ఈ మధ్య లక్ తోక తొక్కినట్టుంది. వరుసగా మంచి ఆఫర్ లు వెతుక్కొంటూ వస్తున్నాయి. నిజానికి నివేదా థామస్‌ తెలుగులో నటించిన చిత్రాలన్నీ సక్సెస్ సాధించాయి. జెంటిల్మన్ సినిమా తరవాత `నిన్ను కోరి , జై లవకుశ , 118 , బ్రోచేవారెవరురా […]

Written By: , Updated On : April 21, 2020 / 08:06 PM IST
Follow us on


2016 లో మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ` జెంటిల్మన్ ` చిత్రం లో నాని సరసన హీరోయిన్ గా నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించు కొన్న నివేదా థామస్‌ ఈ మధ్య లక్ తోక తొక్కినట్టుంది. వరుసగా మంచి ఆఫర్ లు వెతుక్కొంటూ వస్తున్నాయి. నిజానికి నివేదా థామస్‌ తెలుగులో నటించిన చిత్రాలన్నీ సక్సెస్ సాధించాయి. జెంటిల్మన్ సినిమా తరవాత `నిన్ను కోరి , జై లవకుశ , 118 , బ్రోచేవారెవరురా `చిత్రాలతో నివేదా థామస్‌ సక్సెస్ అందుకొంది. ఇపుడు తాజాగా నటించిన మల్టి స్టారర్ మూవీ ” వి ” కూడా బాగుంది అన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక నివేదా థామస్‌ నటించ బోయే చిత్రాల లిస్టులో పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ ” వకీల్ సాబ్ ” ఉండగా ఇపుడు మరో సూపర్ మూవీ లోసెకండ్ హీరోయిన్ ఆఫర్ వచ్చింది.

`ఆల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకొన్న అల్లు అర్జున్ ఇపుడు మరో పవర్ ఫుల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రంగస్థలం ఫేమ్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ రెండు డిఫరెంట్ గెటప్ లలో కన్పించ నున్నాడు.. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ హై ఎక్స్ పెక్టెడ్ (HIGH EXPECTED ) మూవీ లో ఇద్దరు హీరోయిన్ లు నటించ నున్నారు. అందులో ఒక హీరోయిన్ రష్మిక మందన్న కాగా రెండో హీరోయిన్ గా నివేదా థామస్‌ నటిస్తోంది . ఈ లెక్కన ఇద్దరు మెగా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రిస్టేజ్ చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా థామస్‌ చాలా చాలా లక్కీ ఫెలో అనక తప్పదు .