ఎంత దూరమైన ఇంతే టికెట్ ధర!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలుపరిచే క్రమంలో వలస కార్మికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. తాజాగా వారిని, వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే దూరంతో సంబంధం లేకుండా వలస కూలీల కోసం టికెట్ ధర కేవలం రూ.50లే నిర్ణయించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి తెలిపారు. తాజాగా మరో 300రైళ్ళను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం […]

Written By: Neelambaram, Updated On : May 4, 2020 10:42 am
Follow us on

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలుపరిచే క్రమంలో వలస కార్మికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. తాజాగా వారిని, వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే దూరంతో సంబంధం లేకుండా వలస కూలీల కోసం టికెట్ ధర కేవలం రూ.50లే నిర్ణయించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి తెలిపారు. తాజాగా మరో 300రైళ్ళను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.12వేల కోట్లు అందించామని మంత్రి వెల్లడించారు.

స్వంత రాష్ట్రాలకు వెళ్లాలనే వలసకార్మికుల కోసం గతవారం ఆరు రైళ్లు నడిపామని, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రీకులను తరలింపులో కేంద్రం, ఆయా రాష్ట్రాలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఎవరిని తరలించాలో రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులే గుర్తిస్తారన్నారు. వలస కార్మికులు ఉన్న చోటుకే బస్సులు వచ్చి తీసుకెళ్తాయి, ఎవరూ రైల్వే స్టేషన్‌ లోకి రావొద్దు అని కోరారు. వారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని, రాష్ట్రాలు ఎన్ని రైళ్లు కోరితే అన్ని రైళ్లు కేటాయిస్తాం, అని మంత్రి స్పష్టం చేశారు. దూరంతో సంబంధం లేకుండా రూ.50 టిక్కెట్ ధర నిర్ణయించామని, టిక్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వం లేదా పనిచేసే కంపెనీ చెల్లించాలన్నారు.