బుర్రా సాయి మాధవ్ పెద్ద మనసు

కరోనా విలయం కారణంగా మధ్య తరగతి ప్రజల జీవితాలు కుదేలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా రంగస్థల కళాకారుల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ప్రదర్శనలు లేక వేలాదిమంది కళాకారులు ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీరచయిత సాయిమాధవ్ బుర్రా తన స్వస్థలమైన తెనాలిలో ఆదివారం దాదాపు 300 మంది పేద కళాకారులకు ఒక నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను అందించి తన పెద్దమనసును చాటుకున్నారు విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా? తనను రచయితగా చేసిన […]

Written By: admin, Updated On : May 4, 2020 10:32 am
Follow us on


కరోనా విలయం కారణంగా మధ్య తరగతి ప్రజల జీవితాలు కుదేలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా రంగస్థల కళాకారుల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ప్రదర్శనలు లేక వేలాదిమంది కళాకారులు ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీరచయిత సాయిమాధవ్ బుర్రా తన స్వస్థలమైన తెనాలిలో ఆదివారం దాదాపు 300 మంది పేద కళాకారులకు ఒక నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను అందించి తన పెద్దమనసును చాటుకున్నారు

విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?

తనను రచయితగా చేసిన రంగస్థలం రుణం కొంతైనా తీర్చుకోవాలనే సత్ సంకల్పంతో ఆయన కొంత కాలం క్రితం తెనాలిలో ‘కళలకాణాచి’ అనే సంస్థను స్థాపించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పేదకళాకారులను ఆదుకోవడమే ఈ సంస్థ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

కలవరపెడుతున్న చార్మినార్ జోన్!

అలాంటి సంస్థ ద్వారా మూడు లక్షల పైగా ఖర్చు చేసి పేద కళాకారుల ఆకలి తీర్చడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని సాయిమాధవ్ బుర్రా నిర్వహించడం జరిగింది. కాగా ఈయన చేసిన మంచి పనికి తెనాలి కళాకారులు మాత్రమే కాదు మిగతా ప్రాంతాల కళాకారులు కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది .