కేంద్ర ప్రభుత్వం మార్గంలోనే తెలంగాణలో కూడా ఈ నెల 7తో ముగియనున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలపాటు పొడిగించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది.
కలవరపెడుతున్న చార్మినార్ జోన్!
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ వైరస్ కట్టడి కాకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నారు. దానితో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ అమలును మరింత కట్టుదిట్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ ఈ విషయమై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ లోగా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరపడంతో పాటు, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకొంటున్నట్లు తెలుస్తున్నది.
చిరంజీవిని మెగాస్టార్ అనలేం అన్న జె డి చక్రవర్తి
కేంద్రం ఇప్పటికే మే 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. తెలంగాణలో కూడా మే 21 వరకు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా గుర్తించిన కంటైన్మెంట్ జోన్లలో క్వారంటైన్ గడువు ఈ నెల 21న ముగియబోతుంది.
ముఖ్యంగా కేంద్రం సూచించిన మేరకు గ్రీన్ జోన్ లలో ఏ మేరకు ఆంక్షలను సడలించాలి అనే విషయమై ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఈ విషయమై మంత్రివర్గ సమావేశంలో ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.