https://oktelugu.com/

Eluru: ఇదేం రాజ్యం జగనన్న

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం లో వైసిపి కార్యకర్తలు అప్ప సాని ధర్మారావు, కొనకళ్ళ అప్పారావు, ఆచంట రాకేష్,గంట శేఖర్, తోకల సిద్దిరాజు, మురుగుల దుర్గారావులు నాటు కోళ్ల ఫారం ను నిర్వహిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 29, 2023 10:28 am
    Eluru

    Eluru

    Follow us on

    Eluru: ఏపీలో వైసీపీ శ్రేణుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. అధికార మదంతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక చోట వైసీపీ నేతల దౌర్జన్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఏలూరు జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది. కోళ్లు దొంగలించారంటూ ముగ్గురిపై వైసీపీ కార్యకర్తలు అమానవీయ చర్యలకు దిగారు. పైపులు కర్రలతో దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. బాధితుల్లో ఒకరు దళిత బాలుడు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

    ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం లో వైసిపి కార్యకర్తలు అప్ప సాని ధర్మారావు, కొనకళ్ళ అప్పారావు, ఆచంట రాకేష్,గంట శేఖర్, తోకల సిద్దిరాజు, మురుగుల దుర్గారావులు నాటు కోళ్ల ఫారం ను నిర్వహిస్తున్నారు. ఈనెల 25న అదే గ్రామానికి చెందిన ముప్పిన సురేష్, అరటి కట్ల రాంబాబుతో పాటు దళిత బాలుడు కోళ్ల ఫారం లోకి పనిచేసేందుకు వెళ్లారు.

    అయితే ఫారం లో కోళ్లు కనిపించకుండా పోయాయి. దీంతో ఫారం నిర్వహిస్తున్న వైసిపి కార్యకర్తలు… పనికి వచ్చిన ఆ ముగ్గురిపై అనుమానం పెంచుకున్నారు. ఫారం లోకి ఆ ముగ్గురిని పిలిచి మా కోళ్లను మీరే దొంగలించారంటూ ఆరోపించారు. అయితే తమకు తెలియదని ఆ ముగ్గురు ప్రాధేయపడినా వినలేదు. ముగ్గురు దుస్తులను తొలగించి నగ్నంగా కూర్చోబెట్టారు. కర్రలు, ప్లాస్టిక్ పైపులతో కొట్టి చిత్రహింసలు పెట్టారు. వీపుపై వాతలు తేలిన దెబ్బలతో బాధితులు ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    దళిత బాలుడు విషయంలో మరింత అమానుషంగా వ్యవహరించారు. మా కోళ్లనే దొంగతనం చేస్తావా? ఈరోజు మా చేతుల్లో చస్తావ్ అంటూ కులం పేరుతో దూషించారు. అంతటితో ఆగకుండా దుస్తులు తీయించి కటింగ్ ప్లేయర్ తో మర్మాంగాన్ని నొక్కారు. చేతిపై చర్మాన్ని కత్తిరించారు.

    వైసీపీ కార్యకర్తల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. వారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన శిక్షలు అమలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా బాధితుల ఫిర్యాదు పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కేసు రాజీ చేసేందుకు వైసిపి కీలక నాయకులు రంగంలోకి దిగారు. కానీ బాధితులు వినకపోవడంతో కేసు నమోదు చేయాల్సి వచ్చింది.