Pawan Kalyan Bro Movie: సినిమా ముఖ్యం కాదు.. పవన్ ను వెండితెరపై చూడాలంతే..!

‘బ్రో’ సినిమాకు మాటలను త్రివిక్రమ్ రాశారు. దీతో డైలాగ్స్ ఎలా ఉంటాయో ఎక్స్ పెక్ట్ చేయొచ్చని సినిమా రిలీజ్ కాకముందే అనుకున్నారు.

Written By: Chai Muchhata, Updated On : July 29, 2023 10:18 am

Pawan Kalyan Bro Movie

Follow us on

Pawan Kalyan Bro Movie: పవన్ సినిమా అంటే ఫ్యాన్స్ కు ఒక పండుగే. ఆయన సినిమా వస్తుందంటే పండుగ చేసుకోవడానికి రెడీ అవుతారు. ఇటీవల పవన్ రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉండడంతో వెండితెరపై ఆయనను చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఈ క్రమంలో పవన్ సైతం వరుస బెట్టి సినిమాలు తీస్తున్నారు. సాయిధరమ్ తేజ్ తో ఆయన కలిసి నటించిన లేటేస్ట్ మూవీ ‘బ్రో’. సముద్రఖని డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ మూవీ శుక్రవారం (జూలై 28)న రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ కాగానే రివ్యూలు జోరందుకున్నాయి. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం పవన్ క సపోర్టుగా మాట్లాడారు. అయితే సినిమా కోణంలో చూస్తే పవన్ తన సినిమాకు న్యాయం చేసినా.. కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పవన్ సినిమా అనగానే యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. లవ్, ఎమోషన్ ఎలాటి పాత్రలోనైనా పవన్ ఇమిడి పోతాడు. కానీ ఈ మధ్య పవన్ ఎమోషనల్ సీనిమాలు తీస్తున్నాడు. వాస్తవానికి ‘బ్రో’ ఎమోషనల్ మూవీనే. కానీ ఇందులో కాస్త ఇది తక్కువైందని అంటున్నారు. అయితే ఎమోషనల్ ఉన్న చోట అది కనిపించలేదని కొందరి అభిప్రాయం. వాస్తవానికి డైరెక్టర్ అది చూసుకుంటే బాగుండేదని అంటున్నారు. అయితే సినిమా చివర్లో మాత్రం ఏడిపించారని ఫ్యాన్స్ అంటున్నారు.

‘బ్రో’ సినిమాకు మాటలను త్రివిక్రమ్ రాశారు. దీతో డైలాగ్స్ ఎలా ఉంటాయో ఎక్స్ పెక్ట్ చేయొచ్చని సినిమా రిలీజ్ కాకముందే అనుకున్నారు. కానీ ఒక్కో చోట డైలాగ్స్ శృతి మించాయటున్నారు. హాల్లో కూడా షర్ట్ ఇప్పొచ్చు.. అనే చోట కాస్త ఇబ్బందిగా అనిపించిందని అంటున్నారు. ఓవరాల్ గా పవన్ రేంజ్ లో డైలాగ్స్ లేవని కొందరు అంటున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ సాధారణ సినిమాలో యాక్టివ్ గా కనిపిస్తాయి. కాని ఇందులో ఆయనకు సరైన పదాలు ఇవ్వలేదని అంటున్నారు.

పవన్ గత రెండు సినిమాలు ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ల్లో పాటలు చాలా బాగున్నాయి. వాటికి థమన్ మ్యూజిక్ అందించారు. కానీ ‘బ్రో’ సినిమా కోసం ఎందుకు నిర్లక్ష్యం చేశారని కొందరు అడుతున్నారు. ‘బ్రో’ అనే పాట మినహా ఏ ఒక్క సాంగ్ బాగా లేదని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ పాటల్లో పవన్ ఎలివేషన్ బాగుందని కొందరు చెబుతున్నారు. ఏదీ ఏమైనా తమకు పవన్ కల్యాన్ సినిమా ముఖ్యం కాదని, ఆయనను వెండితెరపై చూడాలన్నదే ధ్యేయమని కొందరు థియేటర్ల బయటచెబుతుండడం ఆసక్తిగా మారింది.