https://oktelugu.com/

కాజల్ కు పెళ్లి అయింది కానీ హనీమూన్ లేదట?

టాలీవుడ్లో అగ్ర కథనాయికగా కొనసాగుతున్న కాజల్ పెళ్లి శుక్రవారం ముంబైలో ఘనంగా జరిగింది. కరోనా నేపథ్యంలో కొద్దిమంది కుటుంబ సభ్యులు.. సన్నిహితుల సమక్షంలో కాజల్ పెళ్లి జరిగింది. తన ఇంటి సమీపంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లోనే పెళ్లి జరగడం విశేషం. కాజల్ పెళ్లయిన వెంటనే పలువురు సెలబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియాలో ఆమె కు వివాహా శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కాజల్ స్నేహితుడు.. ఫ్యామిలీ ఫ్రెండ్.. యువ వ్యాపార […]

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2020 / 09:23 AM IST
    Follow us on

    టాలీవుడ్లో అగ్ర కథనాయికగా కొనసాగుతున్న కాజల్ పెళ్లి శుక్రవారం ముంబైలో ఘనంగా జరిగింది. కరోనా నేపథ్యంలో కొద్దిమంది కుటుంబ సభ్యులు.. సన్నిహితుల సమక్షంలో కాజల్ పెళ్లి జరిగింది. తన ఇంటి సమీపంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లోనే పెళ్లి జరగడం విశేషం. కాజల్ పెళ్లయిన వెంటనే పలువురు సెలబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియాలో ఆమె కు వివాహా శుభాకాంక్షలు తెలిపారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కాజల్ స్నేహితుడు.. ఫ్యామిలీ ఫ్రెండ్.. యువ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుతో ఆమె పెళ్లి జరిగింది. శుక్రవారం గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత రెండ్రోజులు నుంచి కాజల్ ఇంట్లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. తన పెళ్లి ముచ్చట్లను కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.  అయితే కరోనా కారణంగా కాజల్ హనీమూన్ ప్లాన్ చేసుకోలేదని సమాచారం.

    Also Read: పవన్ ను ఢీకొట్టబోయేవాడు ఇంకా దొరకలేదా ?

    ముంబైలోని కాజల్ ఇంట్లో కొద్దిరోజుల నుంచి పెళ్లి సందడి మొదలైంది. మెహందీ ఫంక్షన్ ప్రారంభమైన వెంటనే కాజల్ తన చేతికి మెహందీ పెట్టుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇక నిన్న కాజల్ పెళ్లి జరిగిన తన పెళ్లికి సంబంధించి పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమాల్లో కొనసాగనుండటం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పొచ్చు. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాల్లో నటించనున్నట్లు కాజల్ స్వయంగా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోతున్నాయి. కాజల్ ఇంకొన్నాళ్లు వెండితెరపై కన్పించనుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    Also Read: ఎంగేజ్ మెంట్ అంటూ పునర్నవి ఇంత చీట్ చేసిందా?

    కాజల్ ప్రస్తుతం చిరంజీవికి జోడీగా ‘ఆచార్య’లో.. కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్-2’ సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే ఆమె ‘ఆచార్య’ షూటింగులో పాల్గొనుందని సమాచారం. పెళ్లి తర్వాత కాజల్ చేసే మూవీ ‘ఆచార్య’నే కావడం విశేషం. అయితే కాజల్ హనీమూన్ ఇప్పట్లో ఉంటుందా? ఉండదా? అనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. మొత్తానికి కాజల్ పెళ్లి ఆమెతోపాటు అభిమానులకు సంతోషాన్ని ఇవ్వగా నిర్మాతలకు మాత్రం షాకిచ్చింది.