
తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎ లాగైనా ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని ఉవ్విళ్లూరుతోంది. విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. సానుభూతిని అస్ర్తంగా మలుచుకోవాలని చూస్తోంది. ఇందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇదే చివరి అవకాశం అంటూ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
చంద్రబాబు 70 ఏళ్లు దాటినా యువకుడిలాగే ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోవడంతో చంద్రబాబుకు విజయం రావడం కష్టమే. దీంతో జగన్ నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి కనిపించడం లేదు. తన నాయకత్వంపై ప్రజలకు చెప్పాలన్నా బాబుకు గత ఐదేళ్ల పాలన కనిపిస్తోంది.
చంద్రబాబుకు వయసు దాటిపోతుండడంతో ఇక ఈసారి చివరి ఎన్నికలు అయ్యేలా కనిపిస్తుండడంతో ఇదే చివరి అవకాశమని ప్రచారం చేసుకునేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఒక్క చాన్స్ అని జగన్ రాజకీయాల్లోకి రావడంతో అదే నినాదాన్ని బాబు కూడా పాటిస్తారని తెలుస్తోంది. ఇదే చివరి అవకాశం అంటూ జనంలోక వెళతారని తెలుస్తోంది. సానుభూతి పనిచేస్తుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది.
రెండు రాష్ర్టాల్లో సీఎంలు గట్టిగానే పని చేస్తున్నారు. వారిపై అసంతృప్తి అనేది లేకుండా పోయింది. దీంతో సానుభూతి ఏ మేరకు పని చేస్తుందోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుకు సానుభూతి పని చేస్తుందా అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబు లాస్ట్ చాన్స్ అనే నినాదమే పెట్టుబడిగా పె ట్టుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బాబు భవిష్యత్ ఏంటనే దానిపే చర్చలు జరుగుతున్నాయి.