Homeజాతీయ వార్తలుKolkata civic volunteers : నాడు జర్మనీలో హిట్లర్ షుడ్జ్ టఫెళ్ళు.. నేడు బెంగాల్లో మమతా...

Kolkata civic volunteers : నాడు జర్మనీలో హిట్లర్ షుడ్జ్ టఫెళ్ళు.. నేడు బెంగాల్లో మమతా బెనర్జీ సివిక్ వాలంటీర్లు.. అరాచకానికి ఇది పరాకాష్ట..

Kolkata civic volunteers: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా మహానగరంలో ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఓ జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ ఘటనకు పాల్పడింది మొదట ఒక పోలీసు అనుకున్నారు. ఆ తర్వాత అతడు సివిక్ వాలంటీర్ అని తేలింది. అతడిని విచారిస్తుండగా పలు విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో చాలామందికి పాత్ర ఉందని పశ్చిమ బెంగాల్ పోలీసులు, సిబిఐ అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఘటన జరిగిన ప్రాంతంలో పలు ఆధారాలు సేకరించారు. ఆ వైద్యురాలి పోస్టుమార్టం నివేదికలో మరిన్ని విషయాలు వెలుగు చూడడంతో ఈ కేసు చూడబోతే మరింత సంచలనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసును నిర్భయ -2 గా అభివర్ణిస్తున్నారు. కోల్ కతా హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ వేగంగా కేసు విచారణ చేపడుతోంది. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకొచ్చిన సివిక్ వాలంటీర్ వ్యవస్థ గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది.

ఏంటీ వ్యవస్థ?

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ అనధికార పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో వారికి జీతాలు ఇస్తున్నారు. వారికి సివిక్ వాలంటీర్స్ అని పేరు పెట్టారు. పేరుకు ట్రాఫిక్ నియంత్రణ లో పోలీసులకు సహకారం అని చెబుతున్నప్పటికీ.. వారంతా పరోక్షంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆర్మీగా పనిచేస్తున్నారు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 1,19,000 మందిని ఇలా మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించింది. ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్ కూడా ఒక సివిక్ వాలంటీర్. అతడిని అరెస్టు చేసిన తర్వాత సివిక్ వాలంటీర్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సివిక్ వాలంటీర్లు కోల్ కతా లోని పోలీస్ బ్యారక్స్ లో నివసిస్తుంటారు. పోలీసుల మోటార్ బైక్ నడుపుతుంటారు. ఇక సివిక్ వాలంటరీ వ్యవస్థను తృణమూల్ కాంగ్రెస్ ప్రైవేట్ ఆర్మీగా మార్చుకుంది. కాలం గడుస్తున్న కొద్ది ట్రాఫిక్ నియంత్రణను పక్కనపెట్టి శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థలో షాడోలుగా సివిక్ వాలంటీర్లు మారిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులతో సాన్నిహిత్యం కలిగి ఉండడంతో ఈ వాలంటీర్లకు జీతాలు భారీగానే వస్తున్నాయి. మొదట ఈ సివిక్ వాలంటీర్లకు ఆకుపచ్చ రంగు యూనిఫామ్ ఇచ్చేవారు. తర్వాత మమతా బెనర్జీకి ఇష్టమైన నీలం రంగుకు యూనిఫాం మారింది.

నిరుద్యోగులు భారీగా ఉన్నప్పటికీ..

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 2023 నాటికి 77.6 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని సమాచారం. ఆ స్థాయిలో నిరుద్యోగం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా.. సివిక్ వాలంటీర్లను నియమించుకోవడం విశేషం. అయ్యా వీరికి నెలకు 9000 మాత్రమే వేతనం ఇస్తోంది. వీరికి ఎటువంటి చట్టాలపై శిక్షణ ఉండదు. మానవ హక్కుల పై అవగాహన కూడా ఉండదు. వారికి తెలిసింది మాత్రం ఒకటే అక్కడి తృణమూల్ “దాదా” మెచ్చినట్టు నడుచుకోవడమే. అలా చేస్తే చాలు ఉద్యోగం ఆటోమేటిక్ గా పై స్థాయికి వెళ్తుంది. చాలామంది ఇన్ ఛార్జ్ ఇన్ స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తమ చుట్టూ సివిక్ వాలంటీర్లను వెంటేసుకొని తిరుగుతుంటారు. సివిక్ వాలంటీర్లు పోలీసుల పనులు చేయడం.. వారి తరఫున మామూళ్లు వసూలు చేయడం.. ప్రతిపక్ష పార్టీల నాయకులపై నిరంతరం నిఘా పెట్టడం వారి విధిగా మారిపోయింది. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమం ఉంటే తమ యూనిఫామ్ తీసేసి, అధికార పార్టీ కార్యకర్తలుగా సిబికి వాలంటీర్లు మారిపోతున్నారు. సభ ప్రాంగణాన్ని మొత్తం నింపేస్తున్నారు. చూడబోతే బెంగాల్ రాష్ట్రంలో సివిక్ వాలంటీర్లు ఒకప్పటి జర్మనీ నియంత హిట్లర్ నాయకత్వంలోని నాజీ పార్టీకి చెందిన అత్యంత ప్రమాదకరమైన షుడ్జ్ టఫెల్ గా మారిపోయారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. షుడ్జ్ టఫెల్ లకు చట్టాలపై ఎటువంటి అవగాహన లేకున్నప్పటికీ.. మాజీ పార్టీ కొనసాగిన రెండు దశాబ్దాల పాటు జర్మన్ సైనిక దుస్తుల్లో హడావిడి చేశారు. బెంగాల్ రాష్ట్రంలో సివిక్ పోలీసు వాలంటీర్లను అక్కడి ప్రభుత్వ వెబ్సైట్ ట్రాఫిక్ గార్డులుగా, పోలీస్ స్టేషన్ వద్ద కాపలాదారులుగా పేర్కొంటుండడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular