Gulzarilal Nanda: రాజకీయ నేతల్లో మంచి వారుంటారనుకోవడం భ్రమే. కానీ ఎక్కడో ఓ చోట ఉంటారు. మనమే వారిని గుర్తించం. మనకు హంగూ ఆర్భాటాలే ముఖ్యం. సిద్ధాంతాలు, నీతి నియమాలు పట్టించుకోం. పక్కన ఏం జరుగుతున్నా మనకు అక్కరలేదు. అత్యంత సాధారణ జీవితం గడిపిన వ్యక్తులు కొంత మంది ఉంటారు. అందులో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు. ఆయన పార్లమెంట్ కు సైకిల్ పై వెళ్లి అందరిని ఆశ్చర్యపరచారు. అదే కోవలో ఇంకా కొంత మంది ఉన్నా వారి గురించి మనకు తెలియదు. దేశానికి రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధానిగా చేసిన వ్యక్తికి కనీసం సొంత ఇల్లు కూడా లేకపోవడం అంటే అరుదైన విషయం. ఈ రోజుల్లో వార్డు మెంబర్ అయితే చాలు బోలెడు సంపాదించుకుని దర్జాగా బతికే రోజులు. కానీ ఆయన మాత్రం తన జీవితంలో దేన్ని ఆశించకుండా అద్దె ఇంట్లోనే జీవితం గడిపారు. ఆయనే మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా. ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం.
రాజకీయాలకు దూరంగా జరిగిన తరువాత ఓ అపార్ట్ మెంట్ లో అద్దె ఇంట్లో భార్యతో ఉండేవారు. కొంత కాలానికి భార్య కాలం చేసింది. దీంతో ఆయన ఒంటరిగానే ఇంట్లో ఉండేవారు. అద్దె సమయానికి ఇవ్వకపోవంతో ఇంటి యజమానితో తిట్లు తినేవారు. ఇలా సాగుతున్న ఆయన జీవితంలో ఓ రోజు అద్దె కట్టలేదనే కోపంతో ఇంటి యజమాని చెడామడా తిట్టేశాడు. ఇక ఇంట్లో ఉండొద్దని గొడవ పడ్డాడు. కానీ ఆయన మాత్రం యజమానికి దండం పెడుతూ నీ అద్దె డబ్బు చెల్లిస్తానని ప్రాధేయపడినా ఇంటి ఓనర్ కరగలేదు. ఇంట్లో సామను బయట పడేస్తానని వెళ్లేసరికి షాక్ కు గురయ్యాడు. ఇంట్లో సామను లేదని గ్రహించినా ఉన్న సామను బయట వేస్తానని బెదిరించాడు.
Also Read: ఎట్టకేలకు ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఇక పోరాటం చేస్తారా?
కానీ ఆయన మాత్రం కనికరించాలని మొరపెట్టుకున్నాడు. ఈ సీన్ చూసిన చుట్టుపక్కల వారు అందరు వచ్చి ఇన్నాళ్లుగా ఉంటున్నాడు ఏదో కష్టాల్లో ఉన్నట్లున్నాడు. సమయం ఇవ్వరాదా అని సర్దిచెప్పారు. దీంతో ఇంటి యజమాని రేపు వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అటుగా వెళ్తున్న ఓ జర్నలిస్ట్ ఈ తతంగాన్ని చూసి ఇదేదో పనికి వచ్చే వార్తలా ఉందని ఫొటోలు తీసి వార్తను డెస్క్ కు పంపాడు. దీంతో ఆడెస్క్ ఇన్ చార్జి రిపోర్టర్ తో మాట్లాడాడు. ఆయన ఎవరో నీకు తెలుసా? అంటే తెలియదని సమాధానం చెప్పాడు. సరే అని తెల్లవారి వచ్చిన వార్తను చూసి అధికార యంత్రాంగమంతా అక్కడకువచ్చే సరికి అందరు ఆశ్చర్యపోయారు. ఆయన ఎవరో కాదు మన మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా కావడం గమనార్హం.
అధికారులందరు వచ్చి మీకు ఇల్లు ఇస్తామని చెప్పినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. నాకు ప్రభుత్వం ఇచ్చే ఏ సాయం అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. 94 ఏళ్ల వయసులో కూడా ఆయన సొంతంగానే బతకాలని భావించారు. అత్యంత సాధారణ జీవితం గడిపారు. కానీ ప్రస్తుతం కేవలం ఓ ఎమ్మెల్యే అయితే చాలు జీవితకాలం బతకడానికి కావాల్సినంత సంపాదించుకోవడం. దర్జాగా జీవితాన్ని గడపడం. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. జీవన గమనంలోనే కాదు సిద్దాంతాల్లో కూడా అప్పటికి ఇప్పటికి ఎంతో తారతమ్యం ఉండటం గమనార్హం.
Also Read: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వచ్చేనా? రాయలసీమను 14 జిల్లాలుగా చేయాల్సిందేనా?