https://oktelugu.com/

Pragathi: ఆ హీరో ఓ రోజంతా తనతో గడపమన్నాడు.. ప్రగతి షాకింగ్ కామెంట్స్..

Pragathi: టాలీవుడ్ లో మోడ్రన్ మదర్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నేటి నటిమణుల్లో ‘ప్రగతి’ ఆంటీ ఒకరు. హీరోయిన్లకు అలాగే స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రగతి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఓ ఇంటర్యూలో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, దర్శక నిర్మాతలే కాకుండా ఒక స్టార్ హీరో కూడా రోజంతా తనతో గడపమని ఒత్తిడి చేసినట్టు ఆమె చెప్పుకొచ్చింది. తనతో […]

Written By:
  • Shiva
  • , Updated On : February 4, 2022 / 11:32 AM IST
    Follow us on

    Pragathi: టాలీవుడ్ లో మోడ్రన్ మదర్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నేటి నటిమణుల్లో ‘ప్రగతి’ ఆంటీ ఒకరు. హీరోయిన్లకు అలాగే స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రగతి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఓ ఇంటర్యూలో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, దర్శక నిర్మాతలే కాకుండా ఒక స్టార్ హీరో కూడా రోజంతా తనతో గడపమని ఒత్తిడి చేసినట్టు ఆమె చెప్పుకొచ్చింది.

    Actress Pragathi Mahavadi

    తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తానని ఆ హీరో చెప్పినట్లు ఆమె చెప్పింది. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాకపోతే, ఆ హీరో ఎవరు అనేది మాత్రం ప్రగతి బయటపెట్టలేదు. ప్రగతి లాక్‌ డౌన్‌ లో తన ఫిట్‌ నెస్‌ పై దృష్టి పెట్టింది. పైగా ఫిటి నెస్‌ వీడియోలతో పాటు పలు డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ముందుకు సాగుతుంది.

    Also Read:  టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్ !

    ఈ క్రమంలో పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ పాటకు ఆమె వేసిన అదిరిపోయే స్టెప్పులు బాగా ఆకట్టుకున్నాయి. ఇక త్వరలో ప్రగతి మెయిన్ లీడ్ గా ఓ ఓటీటీ సినిమా చేయబోతుందట. మెయిన్ క్యారెక్టర్ అంటే.. ఒక రకంగా హీరోయినే అని అర్ధం. ఏమైనా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందంతో రెచ్చగొట్టే ప్రగతి ఆంటీ, మొత్తానికి తనలోని హీరోయిన్ ను లేట్ వయసులో చూపించబోతుంది అన్నమాట.

    Actress Pragathi Mahavadi

    ఇంతకీ ప్రగతి ఆంటీని పెట్టి సినిమా తీస్తోన్న డైరెక్టర్ ఎవరంటే.. జీయల్ సురేందర్. గతంలో రవిబాబు మెయిన్ లీడ్ గా సితార అనే ప్లాప్ సినిమా తీశాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లుకు ప్రగతి ఆంటీని పెట్టుకుని ఓ డిఫ‌రెంట్ హారర్‌ థ్రిల్ల‌ర్‌ చేయబోతున్నాడట. ఇది . కొత్త త‌ర‌హా స‌బ్జెక్ట్‌ అట. మంచి సందేశాత్మ‌క చిత్రంగా ఈ సినిమా రూపొందుతోందట.
    మరి ఏంటో.. ఆ కొత్త త‌ర‌హా స‌బ్జెక్ట్‌ ?

    ఏది ఏమైనా ప్రగతి ఆంటీని కూడా హీరోయిన్ ను చేస్తోన్నందుకు ఈ డైరెక్టర్ ను మెచ్చుకోవాల్సిందే. అయితే సినిమా హిట్ ప్లాప్ అనేది పక్కన పెడితే.. ప్రగతి ఫాలోవర్స్ అందరూ ఈ సినిమా చూస్తారు. ఓ వైపు డ్యాన్స్ లతో, మరో వైపు వర్కౌట్లతో మొత్తానికి ప్రగతి సోషల్ మీడియాలో ఎలాగూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాబట్టి ఆ ఫాలోయింగ్ ఈ సినిమాకి కాస్త అయినా ఉపయోగపడుతుంది అనుకోవాలి. మొత్తానికి ఏభైలోకి ఎంట్రీ ఇచ్చాక కూడా, ప్రగతి సోలోగా సినిమా చేస్తోంది.

    Also Read:  మహేష్ పెళ్లి గురించి అడిగితే ఎందుకు సిగ్గు పడ్డాడు ?

    Tags