https://oktelugu.com/

OKtelugu MovieTime: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్ !

OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. శ్యామ్‌ సింగరాయ్‌’తో అలరించిన నాని.. తాజాగా ‘అంటే.. సుందరానికీ!’ అంటూ.. వేసవిలో మరో రౌండ్‌ ప్రేక్షకుల్ని అలరించనున్నారు. అయితే ఈ చిత్ర విడుదల తేదీని నాని ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ చిత్ర విడుదల తేదికి సంబంధించి.. ఏకంగా ఏడు విడుదల తేదీలను నాని ప్రకటించారు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్’ విడుదల తేదీలను గుర్తు చేస్తూ.. మీరు అంతా రెండు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 4, 2022 / 11:25 AM IST
    Follow us on

    OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. శ్యామ్‌ సింగరాయ్‌’తో అలరించిన నాని.. తాజాగా ‘అంటే.. సుందరానికీ!’ అంటూ.. వేసవిలో మరో రౌండ్‌ ప్రేక్షకుల్ని అలరించనున్నారు. అయితే ఈ చిత్ర విడుదల తేదీని నాని ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ చిత్ర విడుదల తేదికి సంబంధించి.. ఏకంగా ఏడు విడుదల తేదీలను నాని ప్రకటించారు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్’ విడుదల తేదీలను గుర్తు చేస్తూ.. మీరు అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా అని ట్విట్టర్ లో తెలిపారు. మొత్తానికి వేసవిలో ‘అంటే.. సుందరానికీ’ రాబోతుంది.

    Ante Sundaraniki

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ రోజు ఎఫ్ఐఆర్ ట్రైల‌ర్‌ను న్యాచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు.

    Also Read:  మహేష్ పెళ్లి గురించి అడిగితే ఎందుకు సిగ్గు పడ్డాడు ?

     

    FIR

    అలాగే మరో అప్ డేట్ ఏమిటంటే.. బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4న ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న ఎపిపోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ‘‘ఇంత యంగ్‌గా ఉన్నావేంటయ్యా బాబూ!’’ అని బాలకృష్ణ అడగ్గా మహేశ్‌ నవ్వులు చిందించారు. తన సినిమాల్లోని ఏదైనా డైలాగ్‌ను వినిపించాలని బాలకృష్ణ మహేశ్‌ను కోరగా ‘‘మీ డైలాగ్‌ మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరు సర్‌’’ అని సమాధానమిచ్చారు.

    NBK Unstoppable With Mahesh

    Also Read: సూపర్ స్టార్ ను దాటేసిన ఐకాన్ స్టార్ !

    Tags