https://oktelugu.com/

KCR Strategy: అంతర్మథనంలో మాట‌ల మాంత్రికుడు.. కేసీఆర్ వ్యూహం అదేనా..?

KCR Strategy: ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహాలు రచించుకుంటేనే రాజకీయ పార్టీలు, నాయకులు మనగలుగుతారు. ఇలాంటి వ్యూహాలు ర‌చించ‌డంలో ఉద్ధండుడిగా, అపర చాణక్యుడిగా పేరుగాంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉద్యమ నేతగా తెలంగాణ స్వరాష్ట్ర సాకారంలో కీలకంగా పని చేసిన కేసీఆర్.. రాష్ట్రం సిద్ధించాక సొంత ఎత్తుగడలతో ఒంటరిగానే బరిలోకి దిగి రెండు సార్లు ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కారు. కాగా, ఇటీవల కాలంలో కేసీఆర్ అంచనాలు తప్పుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ అంతర్మథనంలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 5, 2021 10:44 am
    Follow us on

    KCR Strategy: ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహాలు రచించుకుంటేనే రాజకీయ పార్టీలు, నాయకులు మనగలుగుతారు. ఇలాంటి వ్యూహాలు ర‌చించ‌డంలో ఉద్ధండుడిగా, అపర చాణక్యుడిగా పేరుగాంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉద్యమ నేతగా తెలంగాణ స్వరాష్ట్ర సాకారంలో కీలకంగా పని చేసిన కేసీఆర్.. రాష్ట్రం సిద్ధించాక సొంత ఎత్తుగడలతో ఒంటరిగానే బరిలోకి దిగి రెండు సార్లు ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కారు.

    KCR Strategy

    KCR Strategy

    కాగా, ఇటీవల కాలంలో కేసీఆర్ అంచనాలు తప్పుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ అంతర్మథనంలో పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలను దరిదాపుల్లోకి రానీయకుండా ఎప్పుడూ తనదే పై చేయి ఉండేలా వ్యవహరించే కేసీఆర్.. క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలు బలపడుతున్న విషయాలను గమనించారని సమాచారం. ఈ క్రమంలోనే తనదైన వ్యూహాలను మళ్లీ రచించుకుంటున్నట్లు వినికిడి.

    జాతీయ పార్టీల అంచ‌నాల‌కు అంతుచిక్కకుండా రాజ‌కీయాల‌ను న‌డిపించ‌డంలో దిట్ట‌గా పేరు గాంచిన కేసీఆర్‌.. గ‌త రెండు ఎన్నిక‌ల సంద‌ర్భంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ద‌గ్గ‌రి నుంచి ప్రచారం వరకు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించి ప్రజల అభిమానం చూరగొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అంతటా గులాబీ మయం చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జరిగిన ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి షాక్ త‌గిలింది. ఇది కేసీఆర్‌ను ఆందోళ‌న‌లో ప‌డేసింది. కానీ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని మీడియా ముందర చెబుతున్నా కూడా.. టీఆర్ఎస్ పార్టీ లోలోపల ఓటమిపై బేరీజు వేసుకుంటోంది.

    ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక నుంచే టీఆర్ ఎస్‌కు ఎదురు దెబ్బ‌లు త‌గ‌ల‌డం మొద‌ల‌య్యాయి. ఇక దీని త‌ర్వాత జీహెచ్ ఎంసీ మ‌రో షాక్ ఇస్తే.. దేశ రాజ‌కీయాల‌ను ఆక‌ర్షించిన హుజురాబాద్ ఉప ఎన్నిక దారుణ‌మైన దెబ్బ కొట్టింది. ఈ ఎన్నిక కోసం ఏకంగా దళిత బంధు తీసుకొచ్చి వేల కోట్లు ఖర్చు పెట్టారు. అయినా కేసీఆర్ వ్యూహాలేవీ కూడా పని చేయలేదు.

    Also Read: వచ్చేసారి గెలుపు కోసం కేసీఆర్ కఠిన నిర్ణయం.. ?

    దీంతో ఒక్క‌సారిగా బీజేపీ గ్రాఫ్ పెరిగిపోవ‌డం స్టార్ట్ అయిపోయింది. క్షేత్ర స్థాయిలో బీజేపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయ‌న్న వినికిడి రావ‌డంతో కేసీఆర్ అలెర్ట్ అయిపోయారు. దాంతో ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్‌తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    గతంలో మాదిరిగా సొంత సర్వేలపై ఆధారపడకుండా పీకే టీం ద్వారా సర్వే చేయించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. ఎన్నిక‌ల‌కు ఇంకో రెండేండ్ల స‌మ‌యం ఉన్నప్ప‌టికీ క్షేత్రస్థాయిలో ఇప్ప‌టి నుంచే అభ్యర్థుల ఎంపిక మీద స‌ర్వేలు చేయించి, పార్టీ పరిస్థితులు భవిష్యత్తు రాజ‌కీయాల మీద స్ప‌ష్ట‌మైన వ్యూహాల‌ను ర‌చించుకోవాల‌ని చూస్తున్నారంట‌. ఇక్క‌డ ఓ విష‌యం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ టీం ఇప్పటికే షర్మిల పార్టీ అయిన వైఎస్ఆర్‌టీపీ కోసం పని చేస్తోంది. మ‌రి ఒకే రాష్ట్రంలో రెండు పార్టీల‌కు పీకే టీమ్ ప‌నిచేయ‌దు క‌దా. ఈ నేప‌థ్యంలోనే ఓ అనుమానం క‌లుగుతోంది. పీకే టీమ్ టీఆర్ఎస్ పార్టీకి కూడా పని చేస్తుందా? లేదా అన్న‌ది వేచి చూడాలి.

    Also Read: జగన్‌ విధానాలను కాపీ కొడుతున్న కేసీఆర్‌!

    Tags