Renu Desai: రేణుదేశాయ్ కు పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆస్తులెన్నీ?

Renu Desai: హీరోయిన్ రేణుదేశాయ్ గురించి తెలుగు ప్రజలకు తెలియందేమీ కాదు. టాలీవుడ్లో సక్సఫుల్ హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమంలోనే ఆమె చిరంజీవి తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి అనోన్య దంపత్యానికి గుర్తుగా అకీరా, ఆద్య పిల్లలున్నారు. అయితే వీరిమధ్య మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెల్సిందే. అప్పటి నుంచి ఎవరి జీవితాలను వాళ్లు లీడ్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. పవన్ కల్యాణ్ మరో […]

Written By: NARESH, Updated On : December 6, 2021 12:43 pm
Follow us on

Renu Desai: హీరోయిన్ రేణుదేశాయ్ గురించి తెలుగు ప్రజలకు తెలియందేమీ కాదు. టాలీవుడ్లో సక్సఫుల్ హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమంలోనే ఆమె చిరంజీవి తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి అనోన్య దంపత్యానికి గుర్తుగా అకీరా, ఆద్య పిల్లలున్నారు. అయితే వీరిమధ్య మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెల్సిందే.

Renu Desai

అప్పటి నుంచి ఎవరి జీవితాలను వాళ్లు లీడ్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. పవన్ కల్యాణ్ మరో వివాహం చేసుకోగా రేణుదేశాయ్ మాత్రం పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే కొనసాగుతోంది. రేణుదేశాయ్ మరో పెళ్లి చేసుకుంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నా ఇప్పటికైతే ఆమె పవన్ మాజీ భార్యగానే ఉంది. ఈ బిరుదును ఆమె పొగొట్టుకోవాలని ఆమె ఎంత ప్రయత్నం చేస్తున్నా అది మాత్రం సాధ్యం కావడం లేదు.

నిన్నటితో రేణుదేశాయ్ 41ఏళ్లు పూర్తి చేసుకుంది. పవన్ కల్యాణ్ నుంచి విడిపోయాక ఆమె తన సొంత ఐడింటికీ కోసం ప్రయత్నం చేస్తోంది. రేణుదేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో తరుచూ అభిమానులు ఆమె పర్సనల్ విషయాలను అడుగుతుంటారు. పవన్ కల్యాణ్ తో రిలేషన్, తన పర్సనల్ విషయాల గురించి అభిమానులకు వివరణ ఇవ్వడం ఇటీవలీ కాలంలో కామన్ అపోయింది.

రేణుదేశాయ్ కు తరుచూ ఎదురయ్యే ప్రశ్న.. పవన్ కల్యాణ్ రేణుదేశాయ్ కు ఎన్ని ఆస్తులు ఇచ్చారని? దీనిపై సైతం రేణుదేశాయ్ తనదైన శైలిలో స్పందించారు. పవన్ కల్యాణ్ నుంచి తాను ఏమి ఆశించడం లేదని ఆయన తనకేమీ ఇవ్వలేదని చెప్పింది. అయితే తండ్రి పవన్ కల్యాణ్ తన పిల్లలకు చేయాల్సింది చాలా ఉందని మాత్రం క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే పవన్ కల్యాన్ ఆమెతో విడిపోయే సమయంలో 40కోట్ల వరకు భరణం కింద ఇచ్చాడనే అభిమానులు చర్చించుకుంటూ ఉంటారు.

Also Read: ‘మనీ హెయిస్ట్’​పై రాశీఖన్నా ఎగ్జైటింగ్​ పోస్ట్​
ఇదిలా ఉంటే రేణుదేశాయ్ కు బాగానే ఆస్తులున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఈమెకు ఖరీదైన ఇల్లుతోపాటు మూడు కార్లు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అలాగే పూణేలోనూ కొన్ని స్థిరాస్తులు ఉన్నాయట. ఇక సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా కూడా ఆమె బాగానే సంపాదిస్తుంది తెలుస్తోంది. అలాగే బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉంటే రేణుదేశాయ్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్లోని తన ఇంట్లోనే ఉంటున్నారు. మంచి కథ వస్తే రీ ఎంట్రీ ఇస్తానని ఆమె చెబుతున్నారు. ఇప్పటికే ఆమె ప్రయత్నాలు కోసం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె రీ ఎంట్రీ ఖాయం కానుండటంతో ఫ్యాన్స్ సైతం వెయిట్ చేస్తున్నారు.

Also Read: అలా అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలంటున్న పూజా హెగ్డే