Homeఎంటర్టైన్మెంట్Dhanush controversy with producer: ఆ స్టార్ నిర్మాత హీరో ధనుష్ ని బూటు కాలుతో...

Dhanush controversy with producer: ఆ స్టార్ నిర్మాత హీరో ధనుష్ ని బూటు కాలుతో తన్నాడా..? కారణం ఏంటంటే!

Dhanush controversy with producer: ఇండియా లోనే విలక్షణమైన నటుల లిస్ట్ తీస్తే అందులో ధనుష్(Dhanush K Raja) పేరు లేకుండా మాత్రం ఉండదు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో రజినీకాంత్, కమల్ హాసన్ , సూర్య తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో ఆయన. ఈయనకు తమిళం లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి, తెలుగు , హిందీ భాషల్లో కూడా ప్రత్యేకమైన సినిమాలు చేసి సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. రీసెంట్ గానే తెలుగు లో ‘కుబేర’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ధనుష్. హిందీ లో ‘తేరే ఇష్క్ మెయిన్’ చిత్రం తో మరో భారీ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఒక తమిళ స్టార్ నిర్మా ధనుష్ ని బూటు కాళ్లతో కొట్టాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా ?.

రీసెంట్ గానే ధనుష్ చెన్నై లోని ప్రముఖ విద్య సంస్థ వేల్స్ యూనివర్సిటీ లో జరిగిన కల్చరల్ ఫస్ట్ కి ముఖ్య అతిథి గా పాల్గొన్నాడు. ఈ ఫస్ట్ లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తన జీవితం లో జరిగిన ఈ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘వేల్స్ యూనివర్సిటీ తో నాకు ఎంతో మంచి సంబంధం ఉంది. నా మొదటి చిత్రం ‘తులకువదో ఇలమై’ షూటింగ్ ఇక్కడే జరిగింది. ఈ చిత్రానికి మన వేల్స్ యూనివర్సిటీ అధినేత డాక్టర్ ఐసర్ కె గణేష్ నిర్మాత. ఇందులో ఆయన నటించాడు కూడా. ఒక్క సన్నివేశం నేను ఆయన బూటు కాలుతో దెబ్బలు కూడా తిన్నాను. నా దృష్టిలో పాఠశాల , కాలేజీ రోజులే ప్రతీ ఒక్కరి జీవితం లో మంచి రోజులు’.

Also Read: అల్లు శిరీష్ కాబోయే భార్య నయనికా ఎవరి కూతురో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే నోరెళ్లబెడుతారు!

‘మెడిటేషన్ , మేనిఫెస్టన్ అనేది విద్యార్థి దశ నుండే ప్రతీ ఒక్కరికి ఎంతో అవసరం. ఆ రెండిటిని అనుసరించే వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది ‘ అంటూ చెప్పుకొచ్చాడు ధనుష్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నాడు. అదే విధంగా మారి సెల్వరాజ్ దర్శకత్వం లో ఒక భారీ చిత్రాన్ని కూడా చేయబోతున్నాడు. ఇందులో శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ రెండు మాత్రమే కాకుండా మన భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ లో కూడా ధనుష్ నటిస్తున్నాడు .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version