https://oktelugu.com/

Shyam Singharoy: ‘సిరివెన్నెల’ రాసిన చివరి పాట రిలీజ్​ ఎప్పుడో చెప్పిన ‘శ్యామ్​ సింగరాయ్​’

Shyam Singharoy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా నటించిన తాజా సినిమా శ్యామ్​సింగరాయ్​.. ఈ సినిమాతోనే చాలా రోజుల తర్వాత థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు నాని. గతంలో నాని నటించిన వి, టక్​జగదీశ్​ సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. కానీ, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో నాని అభిమానులు కాస్త నిరాశపడ్డారు. ఈ సారి మాత్రం ఎలాగైనా మంచి సాలిడ్​ కొట్టాలనే కసితో రంగంలోకి దిగుతున్నాడు నాని. ఈ క్రమంలోనే రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో ఓ పీరియాడికల్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 5, 2021 / 10:40 AM IST
    Follow us on

    Shyam Singharoy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా నటించిన తాజా సినిమా శ్యామ్​సింగరాయ్​.. ఈ సినిమాతోనే చాలా రోజుల తర్వాత థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు నాని. గతంలో నాని నటించిన వి, టక్​జగదీశ్​ సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. కానీ, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో నాని అభిమానులు కాస్త నిరాశపడ్డారు. ఈ సారి మాత్రం ఎలాగైనా మంచి సాలిడ్​ కొట్టాలనే కసితో రంగంలోకి దిగుతున్నాడు నాని. ఈ క్రమంలోనే రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో ఓ పీరియాడికల్​ స్టోరీ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్​ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడొన్నా సెబాస్టియన్​లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమా నుంచి రెండో సింగిల్​ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

    సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట కావడంతో.. శ్యామ్​సింగరాయ్​ టీమ్​.. ఈ పాట వెనకున్న కష్టాన్ని తెలుపుతూ.. రిలీజ్​ డేట్​ను ప్రకటించారు. నాని, దర్శకుడు రాహుల్​ మాట్లాడుతూ.. శాస్త్రి గారు ఈ సినిమాలో రెండు పాటలు రాశారని.. ఈ పాట ఆయన రాసిన చివరి పాటని.. చెప్పారు.  ఇలా మరెన్నో విశేషాలు పంచుకుని.. ఈ పాట కోసం ప్రేక్షకులతో పాటు తాము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని దర్శకుడు రాహుల్​ అన్నారు. కాగా, ఈ పాటను డిసెంబరు 7న విడుదల చేయనున్నట్లు తెలిపారు.