https://oktelugu.com/

ఆ కేసు కూడా పెట్టేసిన ఏపీ పోలీసులు?

అవన్నీ కాదు.. నేను నిన్ను పాడు చేశానని చెప్పు.. నేను కూడా నిజమే అని ఒప్పుకుని జైలుకు వెళ్తా.. అని ఓ సినిమాలో ఓ హిరోయిన్ తో హీరో అంటాడు. తనపై ఉన్న పగను ఇలా తీర్చుకొమ్మని సలహా ఇస్తాడు. ఇప్పడు ఏపీ పోలీసులు కూడా ప్రతిపక్ష నేతలపై ఇదే పగతో ఉన్నట్టు ఉన్నారు. ఏపీలో ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామనుకున్న ప్రతిపక్ష నేతల్ని ఏదో ఒక కేసు పెట్టి జైల్లో వేయాలని పోలీసులు డిసైడ్ చేసుకున్నట్లుగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 24, 2021 / 12:27 PM IST
    Follow us on


    అవన్నీ కాదు.. నేను నిన్ను పాడు చేశానని చెప్పు.. నేను కూడా నిజమే అని ఒప్పుకుని జైలుకు వెళ్తా.. అని ఓ సినిమాలో ఓ హిరోయిన్ తో హీరో అంటాడు. తనపై ఉన్న పగను ఇలా తీర్చుకొమ్మని సలహా ఇస్తాడు. ఇప్పడు ఏపీ పోలీసులు కూడా ప్రతిపక్ష నేతలపై ఇదే పగతో ఉన్నట్టు ఉన్నారు. ఏపీలో ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామనుకున్న ప్రతిపక్ష నేతల్ని ఏదో ఒక కేసు పెట్టి జైల్లో వేయాలని పోలీసులు డిసైడ్ చేసుకున్నట్లుగా ఉన్నారు. చివరికి రేప్ కేసు కూడా పెట్టేస్తున్నారు.

    Also Read: రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయ కత్తులు.?

    సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన టీఎన్ఎస్ఎప్ నేతలపై ఏకంగా అత్యాచారయత్నం కేసు పెట్టారు. రిమాండ్ రిపోర్టులోనూ అత్యాచారయత్నం చేయబోయారని రాసి.. న్యాయమూర్తికి సమర్పించారు. రిమాండ్ రిపోర్టు చూసి.. న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. సీఎం ఇంటిని ముట్టడిస్తే.. రేప్ కేసు ఏంటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరో ఐదుగురు టీఎన్ఎస్ఎఫ్ నేతలను పోలీసులు మరోసారి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈసారి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.

    Also Read: కేటీఆర్ టీంలో పొంగులేటి.. కీలక పదవి ఖాయం..?

    పోలీసులు తప్పయిపోయిందని.. కేసు పెట్టిన సెక్షనుల మాత్రం అత్యాచారం కాదని.. చెబుతున్నారు. మామూలుగా ఇలాంటి ముట్టడి కేసులు పెట్టరు. అదుపులోకి తీసుకుని రెండు.. మూడు గంటలు సేషన్లో ఉంచుతారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలంటే.. ఏపీ పోలీసులకు సందు దొరికితే.. అట్రాసిటీకేసు.. అత్యాచారం కేసులు పెడుతున్నారు. ఎవరో వాటర్ బాటిళ్లు వేస్తే.. చంద్రబాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తానికి ఏపీ పోలీసుల వ్యవహారం దేశంలోనే విచిత్రంగా కనిపిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్