https://oktelugu.com/

‘శాకుంతలం’ స్పీడ్ పెంచిన గుణశేఖర్

టాలీవుడ్ లో ఉన్న సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో డైరెక్టర్ గుణశేఖర్ ఒకరు, కానీ కొన్నేళ్ల నుండి ఆయన స్థాయిలో సినిమా రాలేదని అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే ఇటీవల ‘శాకుంతలం’ అనే ఓ పౌరాణిక చిత్రాన్ని రూపోందిస్తున్నట్లు ప్రకటించి అందరిలోనూ ఆసక్తిని పెంచారాయన. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనుందని సమాచారం. Also Read: కేజీఎఫ్2కు […]

Written By:
  • admin
  • , Updated On : January 24, 2021 / 12:42 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో ఉన్న సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో డైరెక్టర్ గుణశేఖర్ ఒకరు, కానీ కొన్నేళ్ల నుండి ఆయన స్థాయిలో సినిమా రాలేదని అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే ఇటీవల ‘శాకుంతలం’ అనే ఓ పౌరాణిక చిత్రాన్ని రూపోందిస్తున్నట్లు ప్రకటించి అందరిలోనూ ఆసక్తిని పెంచారాయన. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనుందని సమాచారం.

    Also Read: కేజీఎఫ్2కు హీరో యష్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

    గుణశేఖర్ తన సినిమాల్లో సెట్స్ మీద ప్రత్యేక ద్రుష్టి పెడతారు. ఒక్కడు సినిమాలో చార్మినార్, అర్జున్ లో మీనాక్షమ్మ దేవాలయం, సైనికుడు లో ఫారెస్ట్ బ్రిడ్జి, వరుడు మూవీలో పెళ్లి మండపం, రుద్రమదేవిలో రకరకాల కోటలు ఇలా ఆయన తీసిన ప్రతి సినిమాలో భారీ సెట్స్ కనువిందు చేస్తాయి. ఇక ఆయన ప్రస్తుతం శాకుంతలం చిత్రంకి సంబంధించి ఓ అదిరిపోయే సెట్‌ను రూపోందించే పనిలో ఉన్నారట. అలానే ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా ప్రాధాన్యత ఉందని, మణిశర్మ ఇప్పటికే అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చే పనిలో నిమగ్నమైయ్యారని తెలుస్తుంది. గతంలో గుణశేఖర్ – మణిశర్మ కాంబినేషన్లో చాలా హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ వచ్చాయి.

    Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు నాగ్ అశ్విన్ సర్ప్రైజ్.. అది ఏంటంటే?

    గుణశేఖర్ కూతురు నీలిమ ‘గుణ టీమ్ వర్క్స్’ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ మూవీలో శకుంతలగా ‘అక్కినేని సమంత’ నటించనుంది. మేల్ లీడ్ దుష్యంతుడి పాత్రలో ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు . ఈ మూవీ కాస్టింగ్ ని ఫైనల్ చేసి త్వరగా షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నాడట. గుణశేఖర్ ఈ చిత్రానికి సంబంధించిన పనులను శరవేగంగా చేస్తున్నారని సినీ వర్గాల నుండి సమాచారం. చాలా కాలం తర్వాత గుణ శేఖర్ నుంచి వస్తున్న ఈ చిత్రంతో ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులలో మంచి అంచనాలు ఉన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్