https://oktelugu.com/

రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయ కత్తులు.?

రాష్ట్రమంతా ఓ వైపు ఉంటే ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ బాబు మాత్రం నా దారి అడ్డదారి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వద్దంటూ సర్కారు.. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రజలు.. వైసీపీ నాయకులు అంటుంటే.. అవేమీ తనకు పట్టనట్లు సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. తాను సొంతంగా తీసుకున్న నిర్ణయంగా కాకుండా ఎవరో చెబితే.. స్క్రిప్ట్ రాసుకుని వచ్చినట్లు… మీడియా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలు వెల్లడించిన ఎస్ఈసీ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 24, 2021 5:56 pm
    Follow us on

    Nimmagadda

    రాష్ట్రమంతా ఓ వైపు ఉంటే ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ బాబు మాత్రం నా దారి అడ్డదారి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వద్దంటూ సర్కారు.. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రజలు.. వైసీపీ నాయకులు అంటుంటే.. అవేమీ తనకు పట్టనట్లు సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. తాను సొంతంగా తీసుకున్న నిర్ణయంగా కాకుండా ఎవరో చెబితే.. స్క్రిప్ట్ రాసుకుని వచ్చినట్లు… మీడియా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలు వెల్లడించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా … ఓ రాజకీయ నాయకుడిగా వ్యవహరించారనేది ప్రత్యక్షంగా చూసిన వారి వాదన. పెద్ద ఎత్తున ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో కనీస అవగాహనతో మీడియా ముందుకు రావాల్సిన రమేశ్ కుమార్ కేవలం ఒక చిన్న పేపరు తీసుకుని వచ్చి.. దాన్ని చదివి… వెళ్లిపోవడం సమావేశానికి వెళ్లినవారిని విస్మయానికి గురి చేసింది.

    Also Read: కేటీఆర్ టీంలో పొంగులేటి.. కీలక పదవి ఖాయం..?

    ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్న సమయంలో మీడియా ముందు మాట్లాడిన ప్రతీ మాటలో రాజకీయ కోణం కనిపించింది. ఎన్నికలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని.. ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించేందుకు సుముఖంగా లేరని స్వయానా ఆయన నోటితోనే ఒప్పుకున్నారు. కరోనా భయం వెంటాడుతుందని ఉద్యోగులు చెబుతుంటే… నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్నట్లుగా మాట్లాడారు. ఏకగ్రీవ ఎన్నికలను తప్పు పట్టడం .. దీనిపై ఐజీస్థాయి అధికారితో పర్యవేక్షణ ఉంటుందని చెప్పడం అచ్చం రాజకీయ నేతలు మాట్లాడిన మాదిరిగానే కనిపిస్తోంది. పంచాయతీ రాజ్ వ్యవస్థను మెరుగు పరుచుకోవాలని ఆయనే విమర్శించారు.

    దాదాపు మూడు లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు ఆ హక్కును వినియోగించుకోలేకపోతున్నారని ప్రస్తావించిన ఆయన.. దానికీ.. అధికారులనే బాధ్యులుగా చేస్తాన్నన్నారు. ఈ వ్యాఖ్యలను ఎవరిమీదో కక్షకట్టినట్లే.. ఉన్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కారు హయాంలో ఎన్నికలు నిర్వహించలేదని ఒప్పుకున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. అందుకు గల కారణాలు చెప్పకుండానే ఇప్పడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం రాజ్యాంగ విధి అంటూ అందుకు విరుద్ధంగానే మాట్లాడారు.

    Also Read: ‘సుప్రీం’ చెప్పినా.. నో

    తాను కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ.. టీడీపీ ఆఫీను నుంచి ఎలా లీకయ్యిందనే అంశానికి నిమ్మగడ్డ వివరణ ఇవ్వకుండానే తనకు సీఎస్ రాసిన లేఖ మీడియాకు ఎలా లీకయ్యిందని తిరుగు ప్రశ్నలు వేశారు. మీడియా సమావేశంలో తన మాటలు చూస్తుంటే.. చంద్రబాబు నాయుడు.. ఓ రాజకీయ స్క్రిప్టు రాసిస్తే… నిమ్మగడ్డ చదివినట్లు ఉందని పలువురు రాజకీయ, ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్