JC Prabhakar Reddy
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ పట్టును మరింత నిలుపుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పుడూ వివాదాలమయంగా ఉండే నియోజకవర్గంలో తగ్గ వైసీపీ, టీడీపీలకు తగ్గ పోరు ఉంటుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. అయితే, మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. ఎవరికి వారు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తాడిప్రతిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా పెన్నా నదిలో తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించిన ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించినున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయనను కదలనివ్వకుండా హైస్ అరెస్టు చేశారు. టీడీపీ నాయకులు ఎవరినీ ఆయన ఇంటి వరకు రానివ్వలేదు. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నిర్భందించారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్న క్రమంలో అక్కడే వరండాలో ఒక్కసారిగా కూలబడిపోయారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే విషయమై స్పందిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని మండిపడ్డారు. అక్కడ ఏమీ జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడం వల్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇసుక అక్రమాలను నిరూపిస్తానని, అలా చేయకుంటే ఊరు నుంచి బహిష్కరించండి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఒక రోజుకు 75 ట్రాక్టర్లు లేదా 15 టిప్పర్లలో మాత్రమే ఇసుక తవ్వుకోవాల్సి ఉండగా, 200 హెచ్‌పీ సామర్థ్యం గల ఐదు మిషన్లతో రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ఆరోపించారు. 200 టిప్పర్లతో లోడింగ్ చేసి తరలిస్తున్నారని అన్నారు. వీటన్నింటికి ప్రభుత్వం బాధ్యత వహించి అడ్డుకోవాలని లేకపోతే వాటిని తగలబెడతామని హెచ్చరించారు.
JC Prabhakar Reddy
ఈ క్రమంలో సోమవారం పెద్దపప్పూరు వద్ద పెన్నా నది వద్దకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తున్న ఆయనను నిలువరించడంతో అక్కడ కూలబడిబోయి కూర్చీలో కూర్చుండిపోయారు. ఎంతకీ లోపలికి వెళ్లకపోవడంతో ఆ కుర్చీతోనే ఆయనను పోలీసులు ఇంట్లోకి తీసుకెళ్లారు. ఉద్రిక్తంగా మారడతంతో పెద్ద ఎత్తున చేరుకుంటున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఈ సారి సాధారణ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి తన తనయుడు అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీ కుటుంబానికి కంచుకోట అయిన తాడిపత్రిలో గత ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ సారి అలా జరగకుండా ఉండేందుకు కారణాలను విశ్లేషించుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన కుటుంబంపై గతంలో దాడులు జరిగిన ఘటనలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2024 ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. వైసీపీ ఆకృత్యాలను అవకాశం దొరికినప్పుడల్లా తన దైన శైలిలో స్పందిస్తున్నారు.