Gold Prices Today : ప్రపంచవ్యాప్తంగా రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మళ్లీ పుంజుకుంది. రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో వీటి ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సాంప్రదాయ సురక్షితమైన పెట్టుబడులలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి బాగా చూపిస్తున్నారు. వీటి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన దేశ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా మన దేశం మార్కెట్లో పెరుగుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే మన దేశ మార్కెట్లో ఈరోజు తులం పసిడి పై ఏకంగా 400 రూపాయలు పెరిగింది. ఇక ఈరోజు మన దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర రూ.99,610 గా నమోదయింది. కొన్ని ప్రాంతాలలో ఇది జిఎస్టి మరియు ఇతర చార్జీలతో కలిపి లక్ష రూపాయలు దాటింది. అలాగే ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.91,130 గా ఉందని సమాచారం. ఇక నిన్న ఒక్కరోజే కిలో వెండి కూడా ఏకంగా 3000 రూపాయలు పెరిగింది. ఈరోజు మన దేశ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,14,100 గా నమోదయింది.
Also Read : బంగారం ఎలా పుట్టింది? ఎలా భూమిపైకి వచ్చింది? దీనివెనుక పెద్ద కథ
దేశంలో పలు ముఖ్యమైన ప్రాంతాలు హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్కత్తా, బెంగళూరు వంటి నగరాలలో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,610 గా ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.91,310 గా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్న వారికి అధిక రాబడి ఇస్తున్న బంగారం ధరలు భవిష్యత్తులో బలహీనంగా ఉండబోతున్నాయి అని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే రెండు నెలల్లో బంగారం భారీగా కుప్పకూలిపోతుందని భావిస్తున్నారు. బంగారం ధరలు ఏకంగా 12 నుంచి 15 శాతం తగ్గుముఖం పడతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.