Dasara movie villain : సినిమా ఇండస్ట్రీలో నటుల కెరియర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రొఫెషనల్ పరంగా సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తే ముందుకు సాగుతున్నప్పుడు వాళ్ళ పర్సనల్ కెరియర్ లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పర్సనల్ గా అంతా సెట్ అయిన తర్వాత ప్రొఫెషనల్ గా చాలా వరకు స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అందుకే నటుడి జీవితం అనేది తెర మీద నవ్వులు పూయించినప్పటికి నిజజీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దసర (Dasara) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు షైన్ టామ్ చాకో(Shain Tom Chako)… దసర మూవీలో ఆయన విలనిజానికి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. ఇక దాంతో ఆయనకు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర (Devara), బాలయ్య బాబు బాబీ కాంబినేషన్ లో వచ్చిన డాకు మహారాజు (Daku Maharaj) సినిమాల్లో అవకాశాలు అయితే వచ్చాయి. ఇక ఆ సినిమాలతో కూడా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన అటు మలయాళం ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే, తెలుగులో కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన ఇప్పుడు అటు మలయాళం ఇండస్ట్రీని, ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది.తమిళ్ నాడు లోని ధర్మపురి జిల్లాలో అందరూ కలిసి ఒకే కారులో వెళుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వీళ్ళు వెళ్తున్న కారు నిలిపి ఉన్న లారీని గుద్దుకుంది. దాంతో చాకో వాళ్ల నాన్న అక్కడికక్కడే మరణించారు…చాకో తో పాటు ఆయన తల్లి కి, సోదరుడికి, డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ప్రస్తుతం వీళ్ళు హాస్పిటల్ లో ఉన్నారు.
Also Read : దసరా 2 ‘ ఇక లేనట్టేనా..? నాని డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషనే అందుకు కారణమా?
ఇక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు గడిస్తే కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీద ఒక క్లారిటీ అయితే రాదు… మొత్తానికైతే ఇప్పుడిప్పుడే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న చాకో ఫ్యామిలీ కి ఇలాంటి ఒక ప్రమాదం జరగడం అనేది తన కుటుంబం మొత్తాన్ని కుదిపి వేస్తుందనే చెప్పాలి.
ఇప్పటివరకు చాకో చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక గత కొద్ది రోజుల నుంచి ఆయన డ్రగ్స్ కేసులో ఇరుక్కొని పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు అంటూ కొన్ని కథనాలైతే వచ్చాయి. మరి ఏది ఏమైనా కూడా చాకో అతని ఫ్యామిలీ తొందరగా కోలుకొని ఇంతకుముందులా తమ జీవితాన్ని కొనసాగించాలని అలాగే చనిపోయిన వాళ్ళ నాన్న ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం…ఇక చాకో సైతం ఇకమీదట మంచి సినిమాలను చేసి స్టార్ నటుడిగా గుర్తింపును సంపాదించుకోవాలని ఆశిద్దాం…