Allu Arjun’s Arrest: అల్లు అర్జున్( Allu Arjun) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఇష్యూ చేసిందా? సంధ్య థియేటర్ తొక్కిసలాటను అల్లు అర్జున్ ను కుట్రపూరితంగా బాధ్యుడిని చేసిందా? ఈ విషయంలో జనసేన ఇప్పుడు రియాక్ట్ అయ్యింది ఎందుకు? బెంగళూరులో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. యావత్ దేశం ఈ ఘటనపై సానుభూతి వ్యక్తం చేస్తోంది. మృతులకు నివాళులు అర్పిస్తోంది. భద్రత కల్పించడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఘటనపై స్పందించారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. అప్పట్లో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటను గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని.. తెలంగాణ మాదిరిగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించారు.
https://x.com/bolisetti_satya/status/1930524417303671284
* సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట
పుష్ప 2 ( Pushpa 2 ) చిత్రం విడుదల సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. పెను దుమారానికి దారితీసింది. ఆరోజు ప్రీమియర్ షో చూసేందుకు హీరో అల్లు అర్జున్ ఆ థియేటర్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే ఎటువంటి అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ అక్కడకు వచ్చారని.. దీంతో అదుపు తప్పి ఈ ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి బాధ్యులను చేస్తూ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికే జనసేన విషయంలో అల్లు అర్జున్ అభిమానులకు రగడ జరుగుతోంది. ఈ ఘటన వెనుక ఏపీ నేతల హస్తం ఉందని కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే తరువాత ఈ వివాదం సద్దుమణిగింది.
Read Also: భారత్‌పై కుట్రలను భగ్నం చేసిన ఆపరేషన్ సిందూర్.. ఎందుకు పొడిగించలేదో తెలుసా?
* బెంగళూరు ఘటన నేపథ్యంలో.. బెంగళూరు( Bengaluru) ఘటన నేపథ్యంలో నాటి సంగతులను గుర్తు చేస్తూ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో సంధ్య థియేటర్ ఘటన సమయంలో అల్లు అర్జున్ విషయంలో కావాలనే చేశారని అర్థం వచ్చేలా జనసేన నేత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.’ సరిగ్గా నిన్న కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. చిన్న స్వామి మైదానంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుటి వారిపై నిందలు వేయడం కంటే.. తప్పు ఎక్కడ జరిగింది అని వెతకడం, ఆ తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కక్ష సాధింపు ద్వారని మంచిది కాదని.. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని.. భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియంత్రణలో ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని.. ఇదంతా బాధ్యతగా వ్యవహరించాల్సిన విషయాలని బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు.
* వ్యూహాత్మక కామెంట్స్..
అయితే తాజాగా జనసేన నేత కామెంట్స్ చూస్తుంటే.. తెర వెనుక వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతూనే.. అప్పట్లో అల్లు అర్జున్ ఇష్యూలో జనసేన పాత్రలేదని చెప్పేందుకు ఆ కామెంట్స్ చేసుకుంటారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే జనసేన నేత కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.