కాంగ్రెస్ సీనియర్ నేతలు హౌస్ అరెస్ట్

కరెంటు బిల్లులను నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ నేతలు ఛలో కలెక్టర్ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్లను భారీగా మోహరించి హౌజ్ అరెస్టులు చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావులను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కాగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇంటి వద్దకు ఉదయం 6 గంటల వరకు పోలీసులు భారీగా చేరుకొని ఆయనను ఇంటి […]

Written By: Neelambaram, Updated On : June 11, 2020 11:11 am
Follow us on


కరెంటు బిల్లులను నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ నేతలు ఛలో కలెక్టర్ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్లను భారీగా మోహరించి హౌజ్ అరెస్టులు చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావులను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కాగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇంటి వద్దకు ఉదయం 6 గంటల వరకు పోలీసులు భారీగా చేరుకొని ఆయనను ఇంటి నుంచి బయటికి రాకుండా గృహనిర్భందం చేశారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన సమయంలో అద్దెలు చెల్లించవద్దని చెప్పిన కేసీఆర్ నేడు స్లాబుల పేరుతో అధిక బిల్లు వసూళ్లకు పాల్పడటం సమంజసం కాదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై ఇంత కక్ష్య సాధింపు చర్యలేంటని ప్రశ్నించారు. తెలంగాణలో మూడు నెలలుగా ప్రజలకు ఉపాధి లేకుండా పోయిందని ఈ పరిస్థితుల్లో వారిపై కరెంటు బిల్లుల భారాన్ని మోపడం కరెక్ట్ కాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న కాంగ్రెస్ నేతలను నిర్భంధించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్టులకు దిగడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలన్నారు.