https://oktelugu.com/

రానా పెళ్లి వాయిదా పడలేదు… అదే రోజు ఫిక్స్‌

వీళ్లు వాళ్లు అని తేడా లేకుండా కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయారు. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. అదే సమయంలో పలువురు సినీ సెలబ్రిటీలు.. సినీ స్టయిల్లో ఆకాశమంత పందిరి అనేలా ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నా.. ఆ అవకాశం లేక వాయిదా వేసుకున్నారు. అందులో నితిన్ రెడ్డి ఒకడు దిల్‌ రాజు (సెకండ్ మ్యారేజ్), […]

Written By:
  • admin
  • , Updated On : June 11, 2020 / 11:27 AM IST
    Follow us on


    వీళ్లు వాళ్లు అని తేడా లేకుండా కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయారు. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. అదే సమయంలో పలువురు సినీ సెలబ్రిటీలు.. సినీ స్టయిల్లో ఆకాశమంత పందిరి అనేలా ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నా.. ఆ అవకాశం లేక వాయిదా వేసుకున్నారు. అందులో నితిన్ రెడ్డి ఒకడు దిల్‌ రాజు (సెకండ్ మ్యారేజ్), నిఖిల్ సిద్దార్థ్‌ మాత్రం లాక్‌డౌన్‌ రూల్స్‌ ఫాలో అవుతూ కొద్ది మంది అతిథులు సమక్షంలో పెళ్లి తంతు కానిచ్చేశారు.

    లాక్‌డౌన్‌ టైమ్‌లో తన ప్రేమ విషయాన్ని బయట పెట్టిన దగ్గుబాటి రానా పెళ్లి విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మిహికా బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించిన రానా.. ఆమె అంగీకారంతో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇరు కుటుంబాలు కూడా ఓకే చెప్పగా.. తన పెళ్లి విషయాన్ని రానా ఇప్పటికే ప్రకటించాడు. వధువు కుటుంబ సంప్రదాయం ప్రకారం కొన్ని రోజుల కిందట రోకా వేడుక నిర్వహించారు. ఆగస్టు 8వ తేదీన పెళ్లి ఫిక్స్ చేశారు. రానా తండ్రి, ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా పెద్ద కొడుకు పెళ్ళి కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ పెళ్లి వాయిదా వేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే, ఇవన్నీ అసత్య ప్రచారాలే అని రానా, మిహికా కుటుంబాలు చెప్పాయి. ముందుగా నిర్ణయించిన తేదీనే అంటే ఆగస్టు 8న పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశాయి. లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటిస్తూ కొద్ది మంది బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వేడుక జరపాలని నిర్ణయించారట. ఆగస్టు 6,7వ తేదీల్లో మెహిందీ ఇతర వేడుకలు నిర్వహిస్తారు.