తెలంగాణ 15వ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో రెండు కీలక అంశాల పై చర్చ జరుగనుంది అందులో ఒకటి రాష్ట్ర బడ్జెట్ కాగా రెండోవది పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ తీర్మానం. ఆర్థిక మంత్రి హరీష్ రావు 8వ రాష్ట్ర బడ్జెట్ 2020-21ను ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను వ్యతిరేకిస్తూ ఈ సమావేశాలలో ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం చేసే అవకాశం ఉంది.
ఈ రోజు ఉదయం 11 గం.కు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రసంగం అనంతరం ఈ సమావేశాలు జరుగనున్నాయి. రాష్ట్ర గరవ్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమిళిసై తొలిసారిగా శాసనమండలి, శాసనసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 22 వరకు ఈ శాసనసభ సమావేశాలు జరుగున్నాయి. 10-12 రోజులు శాసనసభ, 5-6 రోజులు శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Telangana assembly meetings two important issues
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com