టీఆర్ఎస్ ను షేక్ చేస్తున్న తీన్మార్ మల్లన్న!

ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, సామాజిక అంశాలపై ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగే తీన్మార్ మల్లన్న ఒకటిన్నర సంవత్సరాల క్రితం జరిగిన హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అతనికి కేవలం 894 ఓట్లు వచ్చాయి. ఇది నోటాకు వచ్చిన ఓట్ల కన్నా తక్కువ. కానీ ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి తాజాగా ఎమ్మెల్సీగా పోటీచేసిన మల్లన్న పాలక తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీకొంటున్నాడు. అంత డబ్బు పరపతి ఉన్న పార్టీకి ముచ్చెమటలు పటిస్తున్నారు. […]

Written By: NARESH, Updated On : March 19, 2021 8:29 pm
Follow us on

ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, సామాజిక అంశాలపై ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగే తీన్మార్ మల్లన్న ఒకటిన్నర సంవత్సరాల క్రితం జరిగిన హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అతనికి కేవలం 894 ఓట్లు వచ్చాయి. ఇది నోటాకు వచ్చిన ఓట్ల కన్నా తక్కువ.

కానీ ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి తాజాగా ఎమ్మెల్సీగా పోటీచేసిన మల్లన్న పాలక తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీకొంటున్నాడు. అంత డబ్బు పరపతి ఉన్న పార్టీకి ముచ్చెమటలు పటిస్తున్నారు.

ఎంఎల్‌సి ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఏడు రౌండ్లలో మల్లన్న 83,390 ఓట్లతో రెండవ స్థానంలో నిలవడం సంచలనంగా మారింది. టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,11,014 ఓట్లతో సమానంగా ప్రతి రౌండులో మల్లన్న ఓట్లు సాధించాడు. రెండవ ప్రాధాన్యత ఓట్లలోనూ అదే తీవ్రత కొనసాగిస్తున్నాడు.

మల్లన్న క్రేజ్ ఎంతుందంటే.. తెలంగాణ ప్రముఖ నాయకుడు,తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ ఎం. కోదండరంను సైతం వెనక్కి నెట్టడం విశేషం. కోదండరాం 70,265 ఓట్లతో మూడవ స్థానానికి దిగజారాడు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కోదండరం ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. “నిజమైన యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది. టిఆర్‌ఎస్ అభ్యర్థికి అంత డబ్బు పరపతి ఉన్నా కూడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా గ్రాడ్యుయేట్ల 83,000 మంది తనకు ఓటు వేయడం అంటే అంత సులభం కాదు. రెండవ రౌండ్లో లోటును తీర్చగలనని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ”అని తీర్మాన్ మల్లన్న అన్నాడు.

బ్యాలెట్ పేపర్‌లో 39వ స్థానంలో ఉన్న వ్యక్తులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు తన కోసం బ్యాలెట్ లో వెతకడం, తనకు ఓటు వేయడం చూసి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు.“ఇది నా 10 శాతం కృషి ఫలితమేనని అన్నారు..

మరో 90 శాతం పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని.. నేను అలా చేస్తే, పాలక టిఆర్ఎస్ కూడా డిపాజిట్ దక్కదని మల్లన్న అన్నాడు. నా అంతిమ లక్ష్యం వారిని గద్దెదించడమేనని”అని తీన్మార్ మల్లన్న అన్నారు.

తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. టీవీల్లో తీన్మార్ మల్లన్నగా తెలంగాణ గృహాల్లో ప్రసిద్ది చెందాడు. సామాజిక.. రాజకీయ సమస్యలపై అతని తరచుగా వ్యంగ్యంగా ధైర్యంగా వ్యాఖ్యానాలు చేస్తుంటాడు.

మల్లన్న ట్రిపుల్ మాస్టర్స్ – ఎంఏ (పొలిటికల్ సైన్స్) మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం (ఎంసిజె) మరియు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జెఎన్‌టియు) నుండి ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేసి ప్రస్తుతం ఓ చానెల్ లో వ్యాఖ్యతగా చేస్తున్నాడు.