https://oktelugu.com/

ఆధార్ లోని అడ్రస్ ను సులువుగా ఎలా మార్చాలంటే..?

దేశంలోని చాలామంది ప్రజలు వేర్వేరు కారణాల వల్ల అడ్రస్ మారుతూ ఉంటారు. అడ్రస్ మారిన సమయంలో ఆధార్ కార్డ్ లో పాత అడ్రస్ ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. యూఐడీఏఐ ఆధార్ కార్డును కలిగి ఉన్నవాళ్లు సులభంగా అడ్రస్ ను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం. ఈ మేరకు యూఐడీఏఐ కొత్త ప్రతిపాదనలను అమలులోకి తీసుకురావడం గమనార్హం. Also Read: స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకున్నారా.. ఎలా కనిపెట్టాలంటే..? యూఐడీఏఐ కొత్త ప్రతిపాదనల ప్రకారం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 19, 2021 / 08:12 PM IST
    Follow us on

    దేశంలోని చాలామంది ప్రజలు వేర్వేరు కారణాల వల్ల అడ్రస్ మారుతూ ఉంటారు. అడ్రస్ మారిన సమయంలో ఆధార్ కార్డ్ లో పాత అడ్రస్ ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. యూఐడీఏఐ ఆధార్ కార్డును కలిగి ఉన్నవాళ్లు సులభంగా అడ్రస్ ను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం. ఈ మేరకు యూఐడీఏఐ కొత్త ప్రతిపాదనలను అమలులోకి తీసుకురావడం గమనార్హం.

    Also Read: స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకున్నారా.. ఎలా కనిపెట్టాలంటే..?

    యూఐడీఏఐ కొత్త ప్రతిపాదనల ప్రకారం ఆన్ లైన్ లో అడ్రస్ ధృవీకరణ పత్రాన్ని పంపడం ద్వారా సులభంగా అడ్రస్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. యూఐడీఏఐ అడ్రస్ వెరిఫైయర్ సహాయంతో సులభంగా అడ్రస్ ను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే యూఐడీఏఐ షరతులకు అంగీరిస్తే మాత్రమే ఆధార్ కార్డ్ అప్ డేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అడ్రస్ ఛేంజ్ కావాలంటే రెసిడెంట్, అడ్రస్ వెరిఫైయర్ ఇద్దరి మొబైల్ నంబర్లు ఆధార్ తో లింకై ఉండాలి.

    Also Read: వాట్సాప్ యాప్ వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.?

    ఆధార్ తో లింక్ చేసుకున్న మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ వెరిఫైయర్ స్థానంలో కొత్త చిరునామాను ఎంటర్ చేసి సులభంగా అడ్రస్ ను ఎంటర్ చేయవచ్చు. అడ్రస్ చేంజ్ చేసుకోవాలని అనుకునే వాళ్లు https://uidai.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి ఆ తరువాత ఓటీపీని ఎంటర్ చేయాలి.

    ఓటీపీని ఎంటర్ చేసిన తరువాత వచ్చే సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ తో లాగిన్ కావడం ద్వారా సులువుగా అడ్రస్ ను అప్ డేట్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ కొత్త ప్రతిపాదనల వల్ల ఆధార్ కార్డ్ పోగొట్టుకున్న వాళ్లకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.