స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకున్నారా.. ఎలా కనిపెట్టాలంటే..?

మన దేశంలో సంవత్సరంసంవత్సరానికి స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లలో యాప్ ల వల్ల మనం చేసే చాలా పనులు సులభంగా చేయడం సాధ్యమవుతుంది. మనకు ఎంతో అవసరమైన ముఖ్యమైన డేటా స్మార్ట్ ఫోన్లలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఉదయం లేచిన సమయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం చేసే ఎన్నో పనులు స్మార్ట్ ఫోన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. Also Read: వాట్సాప్ యాప్ వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.? […]

Written By: Kusuma Aggunna, Updated On : March 20, 2021 10:59 am
Follow us on

మన దేశంలో సంవత్సరంసంవత్సరానికి స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లలో యాప్ ల వల్ల మనం చేసే చాలా పనులు సులభంగా చేయడం సాధ్యమవుతుంది. మనకు ఎంతో అవసరమైన ముఖ్యమైన డేటా స్మార్ట్ ఫోన్లలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఉదయం లేచిన సమయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం చేసే ఎన్నో పనులు స్మార్ట్ ఫోన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.

Also Read: వాట్సాప్ యాప్ వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.?

అయితే మన స్మార్ట్ ఫోన్ ఇతరుల చేతికి చిక్కితే మాత్రం డేటా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కారణం వల్ల మనం ఫోన్ ను పోగొట్టుకుంటే పడే కంగారు అంతాఇంతా కాదు. అయితే కొన్ని యాప్ లు ఫోన్ ను సులభంగా కనిపెట్టడంలో సహాయపడతాయి. ఫైండ్‌మై ఫోన్ యాప్ తో పాటు ఇతర యాప్ లు పోగొట్టుకున్న ఫోన్ ను కనిపెట్టడంలో సహాయపడతాయి. ఒకవేళ ఫోన్ లో డేటా దుర్వినియోగం కాకూడదంటే సులభంగా డేటాను డిలేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

Also Read: ఆధార్ లోని అడ్రస్ ను సులువుగా ఎలా మార్చాలంటే..?

స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్నవాళ్ల కోసం గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ను అందించడంతో పాటు డేటా భద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటుంది. android.com/find లోకి వెళ్లి మొబైల్ ఫోన్ లో ఏ జీమెయిల్ ఖాతా ఉపయోగించామో అదే జీమెయిల్ ఖాతాతో సులభంగా కనిపించకుండా పోయిన ఫోన్ ను సెలెక్ట్ చేసుకుని ఫోన్ బ్యాటరీ లెవెల్స్, ఆన్‌లైన్ స్థితిని సులువుగా తెలుసుకోవచ్చు.

గూగుల్ మ్యాప్‌లో కనిపించకుండా పోయిన స్మార్ట్ ఫోన్ స్థానాన్ని కూడా తెలుసుకోవచ్చు. గూగుల్ ఫైండ్ మై డివైజ్ యాప్‌ ని వినియోగించి సులభంగా ఫోన్ ను కనిపెట్టవచ్చు. ఫోన్ మిస్ అయినా అందులోని డేటాను సులువుగా తొలగించవచ్చు.