Chandrababu Alliances: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత కొంత కాలం నుంచి తన సహజ స్వభావానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పలువురు అంటున్నారు. ఆయన వ్యవహార శైలిని గమనించి కొందరు ఈ మేరకు కామెంట్స్ చేస్తున్నారు. పలు విషయాల్లో ఆయన తొందరపడుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తాజాగా పొత్తుల గురించి బాబు చేసిన కామెంట్స్..పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమవుతున్నాయి.

తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో చంద్రబాబు పొత్తు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎప్పుడూ తన లోపాలను బయటకు చెప్పకుండా అవతలి వారు లోపాల గురించి మాట్లాడే చంద్రబాబు.. కుప్పంలో చేసిన కామెంట్స్ ద్వారా తన లోపాలను తానే బయట పెట్టేశారని పలువురు అంటున్నారు. జనసేనతో టీడీపీ పొత్తు గురించి ఓ టీడీపీ కార్యకర్త ప్రశ్నించగా, ఆ విషయమై చంద్రబాబు స్పందించారు.
జనరల్‌గా అయితే రాజకీయ పార్టీల పొత్తు గురించి ఎన్నికల సందర్భంలోనే చర్చలు జరుగుతుంటాయి. కానీ, పొత్తు గురించి ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉన్నప్పటికీ ఇప్పుడే చర్చ జరుగుతోంది. జనసేనతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. లవ్ వన్ వే అయితే ఉపయోగం ఉండబోదని అన్నారు. దాని అర్థం టీడీపీ లవ్ చేస్తున్నా జనసేన స్పందించడం లేదని స్పష్టమవుతోంది. చంద్రబాబు వ్యాఖ్యలతో తాను జనసేనతో పొత్తుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చినట్లు అయింది.
Also Read: చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలుస్తాడా? లేదా? ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయి?
మొత్తంగా చంద్రబాబు తన లోపాలను తానే బయట పెట్టుకున్నారని పలువురు అంటున్నారు.
ఇకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అలా పిలుపునివ్వడం ద్వారా తాను ఒంటరిగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేనని చెప్పకనే చెప్పేసినంత పని అయిపోయింది. అలా చంద్రబాబు నాయుడు తన సహజ స్వభావానికి వ్యతిరేకంగా గత కొద్ది కాలంగా మాట్లాడుతున్నారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాము పొత్తులో ఉన్నా ఓడిపోయామని, పొత్తులు లేకపోయినా గెలిచామన్నారు. అయితే, అందులో నిజం లేదు. పొత్తులు పెట్టుకున్నా కూడా టీడీపీ ఓడిపోయింది మాత్రం వాస్తవం. చంద్రబాబు నేతృత్వంలో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచి ఓడిపోయింది టీడీపీ. అలా మొత్తంగా పొత్తుల విషయమై వ్యాఖ్యానించి చంద్రబాబు అప్రతిష్ట మూట కట్టుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Also Read: చంద్రబాబు బాధ పగోడికి రావద్దట?